calender_icon.png 20 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు

20-11-2025 06:23:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలను డీజీపీ ఆదేశాల మేరకు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. నేరాల నియంత్రణపై బుధవారం డిజిపి వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేసినట్టు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించాలని డిఫెన్స్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలని దొంగతనాలు ఆర్థిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించినట్టు తెలిపారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నేరాల సంఖ్యను తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఐఎస్పి అభిలాష్ కుమార్, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.