20-11-2025 05:11:42 PM
శాలిగౌరారం తహసీల్దార్ బిట్ల వరప్రసాద్
నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని శాలిగౌరారం తహసిల్దార్ బిట్ల వరప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ శాలిగౌరారం సంయుక్తంగా యశోద హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో మండలంలోని ఊట్కూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన తహసీల్దార్ వరప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు లేక సామాన్య ప్రజలు బాధపడుతుంటారని, ఉచిత శిబిరాలు పేదలు, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. లయన్స్ క్లబ్ సేవే పరమావధిగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న శాలిగౌరారం మండల ప్రజలు క్లోరోసిస్ మొదలైన సమస్యలతో బాధపడుతుంటారని వారిని గుర్తించి యశోద ఆసుపత్రి వైద్యులు తగిన అవగాహన కల్పించి తగిన చికిత్స లు చేయాలని కోరారు.ఈ శిభిరం లో దాదాపు 250 మందికి యశోద హాస్పిటల్ వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు.హైదరాబాద్ సచివాలయం లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఊట్కూరు (బండమీదిగూడెం) గ్రామానికి బుక్కరాజు సైదులు ఉచిత మందుల పంపిణికి ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య, శాలిగౌరారం క్లబ్ అధ్యక్షులు గుజిలాల్ శేఖర్ బాబు, జోన్ ఛైర్మెన్ బుడిగె శ్రీనివాసులు, క్లబ్ కార్యదర్శులు అశోక్, దామెర్ల శ్రీనివాస్, జిఎస్టి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, డీసీ మెంబర్ డెంకల సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీ వేముల సాయికుమార్, కోశాధికారి గుండు పరమేష్,పాఠశాల హెచ్ ఎం వెంకన్న, లయన్స్ సభ్యులు కప్పల శ్రీకాంత్, మురారిశెట్టి కరుణాకర్, పంచాయితీ కార్యదర్శి దొంతూరి శ్రీకాంత్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.