20-01-2025 07:20:08 PM
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి...
హుజురాబాద్ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పథకాలు అందుతాయని ఎవరు అధైర్య పడవద్దని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ప్రతి ఒక్క నిరుపేదకు అందుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధికి మారు పేరుగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కారు పని చేస్తుందని అన్నారు. మంగళవారం నుండి జరిగే వార్డు సభలలో రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, రాజపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవుల సురేష్, ఇరెల్లి సమ్మయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.