calender_icon.png 22 August, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హతకు మించి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దు

22-08-2025 12:00:00 AM

పీహెచ్‌సీతో పాటు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను తనిఖీ చేసిన 

డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ హెచ్చరిక

ఆదిలాబాద్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, అర్హతకు మించి వైద్యం చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. గురువారం సోనాల మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆస్ప త్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తగు సూచనలు చేయడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో ఓపి విభాగంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్న గుట్ట పక్క తండా, గుర్రాల తండా గ్రామాలలో శానిటేషన్ ను పరిశీలించి ఫీల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.

సోనాల మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ క్లినిక్ లను తనిఖీ చేస్తూ తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి, సూపర్వైజర్ కవిత, హెల్త్ అసిస్టెంట్ లింగారెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ యశోద, ఏఎన్‌ఎం అనసూయ,  ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

హద్దుమీరీ వైద్యం చేస్తే చర్యలు.. 

బెజ్జూర్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులు హద్దు మీరి వైద్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా సూపర్డెంట్ షఫీ , ప్రోగ్రాం అధికారి అజీముద్దీన్ అన్నారు. గురువారం బెజ్జూర్ మండలంలోని ఉట్ సారంగపల్లి గ్రామంలో అనుమతులు లేకుం డా వైద్యం చేస్తున్న ఇంటినీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రైవేటు వైద్యం నిర్వహిస్తున్న నేహా మండల్‌పై విచారణ చేపట్టిన ట్లు తెలిపారు.

మార్మూల గ్రామాలలో రోగులకు ఎలాంటి అవగాహన లేకపోయినా ఇంజ క్షన్, టాబ్లెట్లు ఇవ్వడంతో  కిడ్నీ లివర్ గుండె ఊపిరితిత్తులపై ప్రభావం పడే అవకాశం ఉం దన్నారు. ప్రజలు అనుభవజ్ఞులైన వైద్యుల వద్ద వైద్య సేవలు పొందాలని సూచించారు. ఓ ల్యాబ్ లో అనుమతులు లేకుండా రక్త పరీక్షలు నిర్వహించడంపై నిర్వాహకుడికి నోటీ సులు జారీ చేశారు. అధికారులు తనిఖీలకు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో పలు ప్రాంతాలలో ప్రైవేటు క్లినికులు, ల్యాబ్ లో మూసివేశారు. ఈ కార్యక్రమంలో డివైఎన్‌ఓ రమేష్ చంద్ర, సిబ్బంది ఉన్నారు.