calender_icon.png 17 May, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికిసంక్షేమ పథకాలు

17-05-2025 12:30:52 AM

- మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి 

- ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డితో కలిసి మంజూరు పత్రాలు అందజేత

అబ్దుల్లాపూర్ మెట్, మే 16: కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని పెద్ద అంబర్ పేట్ మాజీ కౌన్సిలర్ అనుపమ లక్ష్మారెడ్డి అన్నారు.  ఇం దిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు కమిషనర్ రవీందర్ రెడ్డి తో కలిసి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే మ పథకాలు అందజేస్తామన్నారు.  4వ వార్డులో స్థలాలు ఉన్న 16 మందికి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మానానికి నిధులు మంజూరయినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్నారు.