calender_icon.png 25 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

25-08-2025 12:05:18 AM

ఆరుగురు గంజాయి నిందితుల అరెస్ట్ 

నకిరేకల్, ఆగస్టు24 : అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ విక్రయించి సేవిస్తున్న ఆరుగురు నిందితులతో పాటు ఒక జేసీఎల్ ను పట్టుబడి చేసినట్లు నకిరేకల్ సిఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఆదివారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఆయన వివరాలు వెల్లడించారు.ఈనెల 23న నకిరేకల్ పట్టణ శివారులోని తాటికల్ రోడ్డు కుమ్మరి బావి దగ్గర అక్రమంగా గంజాయి అమ్ముతున్నారన్నసమాచారం మేరకు ఎస్త్స్ర తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మరియు కొనుక్కొని సేవిస్తున్నఆరుగురునిందితులతో పాటు ఒక జేసీఎల్ ను పట్టుకొని విచారించినట్లు తెలిపారు.

తమ విచారణలో నల్లగొండ పట్టణానికి చెందిన సమీర్, బోరిగం సంపత్ కుమార్ తనకు తెలిసిన వారి నుండి గంజాయిని విక్రయించి సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ పట్టణాలలో అమ్ముతుండేవారు. నకిరేకల్ పట్టణానికి చెందిన యనమల్ల సాయిరాం, ముక్కామల అఖిల్ లు పరిచయం చేసుకొని వారికి గంజాయి అమ్మేవారని, వారు గంజాయిని సేవిస్తున్న నకిరేకల్ కు చెందిన పల్లె బోయిన శివ, శాలిగౌరారం మండలం వల్లాలకు చెందిన బండారి వినయ్, చివ్వెంల మండలం కోమటికుంట కు చెందిన కుంచం నవీన్, ఒక బాల నేరస్థుడు లకు 50 గ్రాములు చొప్పున ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు.

వీరిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు, బాల నేరస్తుని జువైనల్ హోమ్ తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ. 32వేల250 విలువగల 1కేజీ 290 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీ, ఒక ఆటో, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సమీర్ ను త్వరలో పట్టుకొని గంజాయి ఎక్కడ నుండి విక్రయిస్తున్నారన్న పూర్తి వివరాలుతెలియజేస్తామన్నారు.ఈ సమావేశంలో ఎస్త్స్రలు బి. లచ్చిరెడ్డి, జి. కృష్ణ చారి, సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, కే. జనార్ధన్, బి. మధుకర్, ఎం. శ్రీనివాస్, ముజీబ్, వి. సురేష్, డి. శ్రీకాంత్, ఎం. నాగార్జున ఉన్నారు.