calender_icon.png 25 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

25-08-2025 12:11:36 AM

సంస్థాన్ నారాయణపురం ఆగస్టు 2౪ (విజయక్రాంతి): మండలంలోని పుట్టపాక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 బ్యాచ్ పదవ తరగతి పూర్తిచేసుకుని 25 ఏండ్లు  పూర్తయిన సందర్భంగా  పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు, పుట్టపాకలో కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

తమతో చదువుకున్న చిన్ననాటి  స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యా యులు మాట్లాడుతూ.. నేటితరం యువత తల్లిదండ్రులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, మానవీయ విలువలను ఎలా కాపాడుకోవాలి, విద్య ప్రాముఖ్యతను, నేడు జరుగుతున్న సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులతో తమ అనుభవాలను జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఉపాధ్యాయులు, ఏడుకొండలు, కల్పలత, వెంకటేశ్వర్లు, యాదయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, శ్రీరాములు, మోహినుద్దీన్, రవీందర్, జలంధర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు మర్రి మనోహన్ రెడ్డి, రామకృష్ణ, సుదర్శన్ , రాము, ఏడుకొండలు , మల్లేష్, రాజేష్,  సంతోష్ కుమారి, కట్ట సురేష్, కిషోర్ ,  కత్తుల భాస్కర్ సైదులు పల్లె రాజశేఖర్ రెడ్డి , సుధీర్ జయప్రకాష్ వేణుగోపాల్, వీరాంజ నేయులు, భావన ఋషి, నరసింహ,  నాగరాజు,  రమేష్, నశ్రీన్, సుజాత , హేమలత, గీత, మంజుల , శోభారాణి, జ్యోతి, తోపాటు అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.