17-05-2025 12:32:22 AM
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, మే 16: డెంగ్యూ నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మైలార్దేవ్పల్లి లోని ఎమ్మెల్యే p నివాసం నుంచి శివాజీ చౌక్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. డెంగ్యూ దో మల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి అన్నారు. దీని నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్యమని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడం, పూల కుండీలు, పాత టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు.
ఫాగింగ్ మెషిన్లు, స్ప్రే యంత్రాల సహాయంతో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూకు నిర్దిష్టమైన చికిత్స లేదని, లక్షణాలను తగ్గించేందుకు వైద్య సహాయం అవసరమని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.