25-08-2025 01:32:15 AM
- రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
- 57వ డివిజన్ లో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యవసా య, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శా ఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నా రు.మంత్రివర్యులు, ఆదివారం ఖమ్మం 57 వ డివిజన్ రమణ గుట్ట ప్రాంతంలో 2 కోట్ల 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 57వ డివిజన్ ప్రాంతంలో పేదలు ఎక్కువ ఉన్నారని స్థాని క నాయకులు కోరగా ప్రభుత్వం నుండి వ చ్చిన నిధులను అధికంగా ఇక్కడ కేటాయించడం జరిగిందని అన్నారు. ఖమ్మం నగరం లో 2000 ఇండ్లు మంజూరు చేస్తే కేవలం 57వ డివిజన్ పరిధిలో 200 పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చే స్తుందని అన్నారు.
ఈ ప్రాంతంలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ సాధ్యం ఉన్నంత వరకు కృషి చేస్తామని అన్నారు. రాజకీయాలకతీతంగా నిరుపేద ప్రజలకు సంక్షేమ పథ కాలు అందించాలని అన్నారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకునేలా చూడాలని, డివిజన్ లో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, ఒకసారి చేసిన అభివృద్ధి పని పది కాలాల పాటు నిలిచి పోవాలని అన్నారు.
పాఠశాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాల ని, వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫం డ్, కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను పే దల ఇంటి వద్దకు వెళ్లి అందించాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శా ఖ అధికారి డి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, మునిసిపల్ ఇంజినీరింగ్ ఖ మ్మం డివిజన్ కార్య నిర్వాహక ఇంజనీర్ వి. రంజిత్, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదు లు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.