25-08-2025 07:10:03 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఎం బృందం బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవ్యాది అభిషేక్ సింఘ్వి(Lawyer Abhishek Singhvi)తో సీఎం రేవంత్(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సీనియర్ న్యాయవాదులతో చర్చలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కులు లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి సలహాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని, అసెంబ్లీ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు. సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలిపిందని, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని భట్టి వివరించారు.