calender_icon.png 26 August, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ బిల్లులకు సాంకేతిక సమస్యలు

25-08-2025 01:30:46 AM

- నెల రోజులు గడుస్తున్న పరిష్కారం కానీ’ గో టు నియరెస్ట్ లొకేషన్’ సమస్య

- ఇబ్బందులు పడుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు

ములకలపల్లి, ఆగస్టు 24( విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా రు. బిల్లులు మంజూరు గాక ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దశలవారీగా బిల్లులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లబ్ధిదారులు పునాదులు పూర్తిచేశారు. పునాదులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్ బిల్లులు అకౌంట్లలో పడకపోవడంతో ఆర్థికంగా ఇ బ్బందులు పడుతున్నారు.

అధికారులను అడిగితే ఫోటోలు తీసుకోవడం లేదని ’గో టు నియరెస్ట్ లొకేషన్ ’ అనే సాంకేతిక సమస్య కనిపిస్తుందని చెబుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏ ఈ ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తుతుంది. ఇటువంటి సమస్య ఉన్న లబ్ధిదారుల వివరాలను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అక్కడి నుంచే క్లియర్ కావాలని వీరు చెప్తున్నారు. ఈ సాంకేతిక సమస్య ములకలపల్లి మండలంలో లబ్ధిదారులను నెల రోజులుగా వెంటాడుతుంది.

బిల్లులు పడక పోవడంతో పునాది దశలోనే కొందరి ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మండలంలోని పలువురు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటిని పునాది వరకు పూర్తి చేసుకున్నారు. మొదటి దశ బిల్లు కోసం వీరి ఇళ్లను మొదటగా పంచాయతీ కార్యదర్శి లాగిన్ లో ఇందిరమ్మ యాప్ లో అప్లోడ్ చేస్తారు.ఆ తర్వాత హౌసింగ్ ఏఈ లాగిన్ నుంచి మరోసారి అప్లోడ్ చేస్తే బిల్లు అప్రూవల్ అవుతుంది.

అయితే ఇలా అప్లోడ్ చేసే సమయంలో ఫోటో క్యాప్చర్ చేసే సందర్భంలో కొందరు లబ్ధిదారులకు ఒక్కోసారి పంచాయతీ కార్యదర్శి లాగిన్ లో, ఒక్కోసారి హౌసింగ్ ఏ ఈ లాగిన్ లో ’ప్లీజ్ గో టు నియరెస్ట్ లొకేషన్’ అని వచ్చి తిరస్కరణకు గురవుతున్నాయి ఈ సమస్య ఎందుకు వస్తుందో దీనికి సత్వర పరిష్కారం ఎలానో తెలియక పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారు. ములకలపల్లి మండలంలో మొత్తం ఇందిరమ్మ ఇండ్లు 609 మంజూరయ్యాయి.ఇందులో బేస్మెంట్ లెవెల్ 350, రూఫ్ లెవెల్ 50, స్లాబ్ లెవెల్ 13 ఉన్నాయి. మొత్తం ఇళ్లల్లో 527 పనులు ప్రారంభించారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

కొంతమంది లబ్ధిదారుల ఇళ్ల ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలో ’ గో టు నియరెస్ట్ లొకేషన్’ అనే సాంకేతిక సమస్య కనబడుతుంది. నెల రోజుల నుంచి ఈ సమస్య తలెత్తి బిల్లుల మం జూరులో అవరోధంగా ఉంది. ఈ సమ స్య తలెత్తిన లబ్ధిదారుల వివరాలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాము. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారంఅవుతుంది.

 హౌసింగ్ ఏ ఈ శ్రీధర్.

బిల్లు రాక నెలరోజులు దాటింది.

ఇందిరమ్మ ఇంటి పథకంలో పునాది పనులు పూర్తిచేసుకుని నెలరోజులు దా టింది. నేటివర కు మొదటి విడత బిల్లు మంజూరు కాలే దు. ఇప్పటికే పు నాది పనుల కోసం మెటీరియల్‌తో కలుపుకొని రూపాయ లు 1. 50 లక్షలు ఖ ర్చు చేశాం. అధికారులను అడిగితే పునాది ఫోటోను క్యాప్చర్ చేసే సమయంలో’ గోటు నియరెస్ట్ లొకేషన్’ అనే సమ స్య చూపెడు తుందని అంటున్నారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియ డం లేదు. సమస్యను పరిష్కరించి బిల్లు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

ఊకే కళ్యాణి, ఆనందపురం