26-01-2026 11:14:28 AM
గరిడేపల్లి,(విజయక్రాంతి): పేద ప్రజల కోసం నిరంతరం పోరాడి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అమరులైన నాయకుల ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి కడియాల అప్పయ్య కోరారు.మండలంలోని గానుబండ గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు కడియాల జానకమ్మ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపన ధ్యేయంగా,నిరుపేద కుటుంబాల జీవనం బాగుపడాలని సిపిఐ తరఫున పోరాటం చేసి అసువులు బాసిన వారిలో జానకమ్మ ఒకరని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన అమరుల ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మొదట జానకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.గ్రామ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య,బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త సతీష్ రెడ్డి,సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కుందూరు వెంకటరెడ్డి,పోకల ఆంజనేయులు,పంగ గోవిందు,శేఖర్,షేక్ నబి సాహెబ్,పుల్లయ్య,సైదులు,తిరపయ్య,కాశయ్య,గోవిందరెడ్డి,పీర్ సాబ్,ఈశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.