26-01-2026 11:13:00 AM
రఘురామ కృష్ణంరాజు చంద్రబాబును తీసుకురావాలని కోరుతున్న
రథ సప్తమి సందర్భంగా పాప నాశ వ్రతం
ముఖ్య అతథులుగా పాల్గొన్న జగ్గారెడ్డి, ఏపి డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణం రాజు
సంగారెడ్డి, (విజయక్రాంతి): సంగారెడ్డి మండలం ఫసల్ వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రథసప్తమిని పురస్కరించుకొని 1,671 మంది మహిళలతో భారీస్థాయిలో పాపనాశ వ్రతాన్ని నిర్వహించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపిసిసి జనరల్ సెక్రటరీ తోపాజి అనంత కిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పాపాలను హరింపజేసే ఈ వ్రతం లోక కళ్యాణార్థం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్ పాల్గొన్నారు