05-05-2025 01:16:48 AM
సమస్యల నిలయం సోములగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం
ఆందోళనలో రైతులు
భద్రాద్రి కొత్తగూడెం మే 4 (విజయక్రాంతి)ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాల పాలై రైతులను అప్పులపాలు చేస్తోంది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టం కలిగించింది. ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షాలకి తడిసి మొలకెత్తుతున్నాయి. ధాన్యం కొనుగోలులో అధికారులు అలస త్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరి పడా వసతులు లేకపోవడంతో కొనుగోలు, స్థూలకాలు మందకొడిగా సాగుతున్నాయని రైతులు వాపోతున్నారు. పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తే సమస్యల నిలయంగా ఉంది.
సోమల గూడెం రెవెన్యూ పరిధిలోగల 3వేల ఎకరాలలో పండే వరి పంట ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తుంటారు. అందుకు సరిపడా యాడ్ విస్తీ ర్ణం లేకపోవడం, యార్డు వద్ద విద్యుత్ సౌక ర్యం లేక సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి సర్వీస్ వైర్ ద్వా రా తూర్పాల పట్టే మిషన్ నడిపించడంతో దాన్యం తూర్పాల లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
మండలంలోని అతిపెద్ద కొనుగోలు కేంద్రం లో సరిపడా వసతులు లేకపోవడం రైతుల పాలు శాపంగా మారింది. కాటా పెట్ట ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా లారీలు రాకపోవడం తో ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ఆదివారం కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిసి కొనుగోలు కేంద్రంలో సుమారు 20 లారీల ధాన్యం ఆరబెట్టి నిల్వ దీంతో రైతులు రోజుకు ఒక లారీ మాత్రమే ధాన్యం తరలించేందుకు వస్తుందని రైతులు తెలిపారు.
ఇప్పటికే రెండు మూడు దఫాలుగా అకాల వర్షాలు రావడంతో ఆరబెట్టిన ధాన్యం మొ లకెత్తిందని రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు 41 కిలో ధాన్యం కాటా పెట్టాల్సి ఉండగా 42 కేజీల 100 గ్రాములు చొప్పున ధాన్యం ఖాతా చేస్తున్నారని రైతుల ఫిర్యాదు చేశారు. దీంతో సుమారు కిలో నష్టపోవాల్సి వస్తుందన్నారు.
ఎప్పటికైనా జిల్లా అధికారులు సోమల గూడెం దాన్యం కొనుగోలు కేంద్రంలో సరిపడా వసతులు కల్పించాలని, ప్రధానంగా యార్డు సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, రోజుకు మూడు నుంచి నాలుగు లారీలు పంపించాలని, తూర్పు పాలు పట్టే మిషన్ లు పెంచా లని రైతుల కోరుతున్నారు. లేనిపక్షంలో అకాల వర్షాలు అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించేలా పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.