10-02-2025 12:00:38 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 9 (విజయక్రాం తి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్దులపై అధికారుల నిఘా లేకపోవడంతో వారికి భద్రత లేకుండా పోతుందని జిల్లాలే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా స్పష్టమవుతున్నది.
విద్యార్దులను మానసిక, శారీరక వేదిం పులకు గురి చేస్తుండటం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, 50 శాతం సంఘటనలు బయటకు రాకుం డా జాగ్రత్త వహిస్తూ రాజీ కూదిర్చికుం టున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.
ముఖ్యంగా 10వ తరగతి విద్యార్ధులపై ఈ ప్రభావం ఎక్కవగా ఉందని, వీటిపై అధికా రులు స్పందిచకపోతే విద్యార్ధులు ప్రమాదం తో పడటమే కాకుండా ఫలితాలపై ప్రభా వం చూపే అవకాశం ఉంటుందంటున్నారు.
బయటకు రాకుండా జాగ్రత్తలు...
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భాద్యతలు తీసుకున్న తరువాత హాస్టళ్లపై పర్యవేక్షణ పెరగడంతోపాటు, చిన్న తప్పును కూడా సహించకుండా భాద్యులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్న కొందరు విద్యార్ధులు ప్రమాధాలు, వేదిం పులు గురి అవుతున్న కొన్ని చోట్ల బయటకు రాకుండా హాస్టళ్ల నిర్వహకులు జాగ్రత్త పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బయటకు వస్తే హస్టళ్ల నిర్వహకులు, అధికా రులపై చర్యలు ఉంటుండటంతో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారని కొందరు అంటు న్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో ఉం టూ పాఠశాలలో చదువు తున్న విద్యార్ధు లపై మానసికంగా వేదిస్తు న్నారని, కొన్నిచో ట్ల శారీరక వేదింపులు జరుగతున్నాయనే ఆరోపణలు ఉండగా వీటిని బయ టకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు. ముఖ్యంగా ప్రైవేటు పై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాల హాస్టళ్ల నిర్వహకు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
మోతే మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సుమారు 50 రోజుల క్రితం 10వ తరగతి విద్యార్ధిని హాస్టల్ భవనంపై నుంచి దూకి ప్రమాదానికి గురైన ది. ఈ విషయంపై ఏలాంటి కేసు నమోదు కాకపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి.
కోదాడ నియోజకవర్గ కేంద్రంలో గత రెండు నెలల క్రితం ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఉంటున్న విద్యార్ధి ట్యూటర్తో బయటకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు. గత వారం రోజుల క్రితం కోదాడ రూరల్లో ఉన్న ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్ధులు పారిపోగా విజయవాడలో పోలీసులకు పట్టుకున్నారు.
విద్యార్ధులు పారిపోవడం వెనుక ఏమి జరిగిందే బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ బీసీ హాస్టల్ వార్డెన్ వేదింపులకు గురిచేస్తుందని అందిన పిర్యాదుపై అధికారులు వార్డెన్కే అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.