calender_icon.png 29 October, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటుపరంతో అన్యాయమే!

29-10-2025 01:33:25 AM

జి అనురాధ :

కనీస హక్కులు, సౌకర్యాలు లేకుం డా బతుకును భారంగా మోస్తున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కో రుతూ కార్మిక సంఘాలు చేసిన అనేక పోరాటాలతో 1996లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ఏర్పడింది. రాష్ర్టం లో 25 లక్షల మంది ప్రత్యక్షంగా, కోటి మంది పరోక్షంగా ఉన్న 37 రకాలైన భవన నిర్మాణాల  కార్మికులకు ఈ చట్టం ప్రకా రం సంక్షేమ సౌకర్యాలు అమలు చేయబడుతున్నాయి.

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా నేడు భవన నిర్మాణ కార్మికులకు అంతంత మాత్రంగా అమలు జరుగుతున్న సంక్షేమ సౌకర్యాల అమలుకు ముగింపు పలికేందుకు కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి.

ఐఎప్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో ఢిల్లీ, పంజాబ్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులు రాష్ర్ట జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు.

తెలంగాణ రాష్ర్టంలో కాం గ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు నిర్ణయించు కొని కార్మిక సంఘాలు, నిర్మాణ రంగ నిపుణు లు ఎవరితోను చర్చించకుండా గుట్టుచప్పుడు కాకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఎన్నికల సందర్భంగా రా ష్ర్టంలో భవన నిర్మాణ కార్మికులకు కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన హామీలకు ఇది వ్యతిరేకమైనది. ఈ నిర్ణయం రాష్ర్టంలోని కోటిన్నర మంది కార్మిక కుటుంబాలకు తీవ్రనష్టం కలిగిస్తుంది. 

1996 కార్మికుల చట్టం

నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పా క్షిక అంగవైకల్యానికి రూ.4లక్షలు, ప్రసూ తి, దహన సంస్కారాలు తదితర వాటికి రూ లక్ష, వివాహానికి తులం బంగారంతో పాటు లక్ష రూపాయల నగదు, పిల్లల ఉన్నత చదువుల వరకు సంక్షేమ బోర్డు ని ధుల ద్వారా ఆర్ధిక సహకారం చేసేందుకు కేటాయించేలా భవన కార్మికుల చట్టం 1996ను తీసుకొచ్చారు. 

కేరళ, తమిళనా డు, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలను రాష్ర్టంలో మరింత మెరుగుపరిచి అమలు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు రహ స్యంగా టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయు అనుబంధ తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ, బీఆర్టీయూ, బీఎన్‌ఆర్‌కేఎస్, ఎస్‌బిఎన్ కెఎస్, టీబీఎన్కెఎస్, టీబీఎన్‌కేటీయు లాంటి భవన నిర్మాణ కార్మిక సం ఘాలు జేఏసీగా ఏర్పడి 2024, నవంబరు 23న ‘చలో హైదరాబాదు’ కార్యక్రమాన్ని నిర్వహించాయి.  

చీకట్లోకి నెట్టడమే

2009 వివరాల ప్రకారం, రాష్ర్టంలో మొత్తం 33 జిల్లాల్లో వివిధ నిర్మాణ రంగా ల్లో పనిచేస్తున్న కార్మికులు 25,71,468 మంది ఉన్నారు. వీరిలో 14,50,366 మం ది పురుషులు కాగా.. 11,20,102 మంది మహిళా కార్మికులు ఉన్నారు. 2009లో బోర్డులో సభ్యత్వం నమోదుచేసుకున్న కా ర్మికుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 10,60,656 మంది నిర్మాణ కార్మికుల స భ్యత్వాన్ని రెన్యువల్స్ ఆగిపోయాయి.

అందువల్ల ఇప్పుడు 15,10,350 మంది సభ్యు లు తమ సభ్యత్వం రెన్యూవల్ చేసుకున్నారని సంక్షేమ అధికారులు ప్రకటిస్తున్నారు. 2009 నుంచి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నిర్మాణ కార్మి కులకు 11 రకాలైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నారు. పనిలో నిత్యం ప్రమాదాలతో సాగుతున్న భవన నిర్మాణ కార్మికుల జీవితాలలో ప్రైవేటు కంపెనీల చేతుల్లో బోర్డు ను పెట్టడం చీకట్లోకి నెట్టడమే అవుతుంది.

కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని, సదుపాయాలను పెంచేందుకు నిర్ణయాలు తీసుకోకపోగా, బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకా లకు ఎసరు పెట్టే ప్రక్రియను ప్రారంభించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిం చొచ్చు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందిస్తున్న సౌకర్యాల్లో ప్రభుత్వం తమ బాధ్యతను వదులుకొని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం అన్యాయం.

తెలంగాణ రాష్ర్టంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ పేరుతో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లుగా నమ్మించి అధికారంలోకి వచ్చింది. అయి తే గద్దెనెక్కిన కొద్దికాలానికే తమ హామీని విస్మరించి కార్మిక సంక్షేమాన్ని గాలికి వదిలేసింది.

టెండర్లలో జొమాటో, స్విగ్గీ కార్మికులుగా పనిచేస్తున్న 10వేల మందిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు లో చేర్చేందుకు కుట్ర చేస్తున్నారు.ఒక పక్క న 25,71,880 మంది సభ్యత్వం తీసుకున్న నిర్మాణ కార్మికుల్లో అందరి సభ్య త్వాన్ని రెన్యువల్ చేయకుండా ఇంకో 10 వేల మందిని అదనంగా చేర్చాలని చూ డటం అన్యాయం కిందకు వస్తుంది.  

ఉద్యమం అవసరం

నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వా రా కార్మికులకు అమలు చేయబడుతున్న వివిధ సదుపాయాలన్నింటిని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం అంతర్లీనంగా కంపెనీలకు అవకాశం కల్పించబోతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేబర్ కార్డుల్లో చిన్న చిన్న తప్పుల సాకులు చూపించి కార్మికులకు పరిహారం అందకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ బోర్డులో కార్మికుల సొమ్మును బడా కార్పొరేట్ శక్తులు స్వాహా చేసేందుకు అవకాశముంది.

భవిష్యత్తులో అడ్డా కార్మికుల పరిస్థితి అనాధలుగా మా రే ప్రమాదం రానుంది. బడా కార్పొరేట్ కంపెనీల యజమానుల వద్ద పనిచేస్తున్న ఈ కార్మికులు రవాణా సౌకర్యం కానీ, పెట్రోల్ అలవెన్స్ కానీ, నిర్ధిష్టమైన పనిగంటలు కానీ, ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లు, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తున్నారనడంలో సందేహంలేదు.

మహాన గరాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాలకు గురై దిక్కులేని చావు చస్తున్నారే తప్ప మరణించిన వ్యక్తికి అటు కంపెనీలు గానీ ఇటు ప్రభుత్వం కానీ వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు, ఆర్థిక సహాయం అందించడం లే దు. అందువల్లే ఈ కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు, సౌకర్యాలు సదుపాయాలను కల్పించాల్సి న అవసరముంది. తెలంగాణ రాష్ర్టంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బో ర్డులో కోట్లాది రూపాయల నిధులు ఉన్నా యి.

1996లో ఏర్పా టు చేసిన ఈ బోర్డులో భవన నిర్మాణ కా ర్మిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, యజమానుల నుంచి త్రైపాక్షిక కమిటీని ఏర్పా టు చేయాలి. కమిటీ నిర్ణయాలతోనే నిధులను ఖర్చు చేయాలి. నష్ట పరిహారం చెల్లిం చాలని 2, 97, 277 మం ది కార్మికులు బోర్డుకు చేసుకున్న దరఖాస్తులు ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 35,892 కాగా.. వరంగల్(అర్బన్)లో 24,312, వరంగల్ (రూరల్)లో 22,167 ఉన్నాయి.

రాష్ర్టం లో ఉన్న 25 లక్షల 72 వేలమంది భవన నిర్మాణ కార్మికు, వీరికి తోడు కోటిన్నర మందికి పరోక్షం గా లాభం చేసేందుకు తోడ్పడుతున్న సం క్షేమ బోర్డు నిధు లను, సౌకర్యాలను ప్రై వే టు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే చర్యలను వ్యతిరే కిం చాల్సిన అవసరం ఉంది. కార్మిక వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని తి ప్పికొట్టే వరకు పోరాటం సాగుతునే ఉం టుంది. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉరితాడుగా మారిన ప్రైవేటు పరం అంశాన్ని తొలగించేందుకు కార్మిక ఉద్యమం జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.