calender_icon.png 29 October, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు పాలకుల బంధం..

29-10-2025 01:30:16 AM

పాలకుర్తి రామమూర్తి :

సర్వత్ర చోపహతాన్ 

పితేవానుగృహ్ణీయాత్..

(కౌటిలీయం 4-3)

తమ ప్రజలు ఎలాంటి కష్టాలలో ఉన్నా పాలకులు తండ్రివలె ఆదుకోవాలి అంటాడు ఆచార్య చాణక్య. ప్రజల కు ఏది అవసరమో దానిని గుర్తించి అందించే ప్రయత్నం చేయడమే.. తండ్రివలె ఆదుకోవడం. అన్ని పరిమితులను, అవరోధాలను అధిగమించి ప్రజలు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, శక్తియుక్తులను పూర్తిగా వినియోగించుకునేందుకు తగిన అవకాశాలను, శిక్షణాకేంద్రాలను అందుబాటులోకి తేవాలి. పారదర్శకతతో కూడిన విధానాలను ఏర్పరుస్తూ.. సంక్షేమాలు, అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటిస్తూ.. వాటిని సమాంతరంగా నడపడం ప్రభుత్వాల కర్తవ్యం.

అయితే ఈనా డు అన్ని ప్రభుత్వాలూ అధికారం కోసం తాపత్రయ పడుతున్నాయే కాని ప్రజల బాగోగులు పట్టించుకునేందుకు ముందు కు రావడం లేదు. ప్రజల అభ్యుదయాని కన్నా ప్రపంచ దేశాలన్నీ సైనిక బలాల ఆధిక్యతను, వ్యాపార విస్తరణలో ఆధిక్యతను ప్రదర్శించడంలోనే తలమునకలౌతున్నాయి.

అసమర్థులు లేరు!

ప్రజల అభ్యుదయమే పాలకుల అభ్యుదయంగా భావించిన నాయకుడు ఉత్తమ ఫలితాలను సాధించగలడు. ప్రజల అభ్యుదయం ప్రభుత్వాలు కల్పించే ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై ఆధారపడి ఉంటుంది. ప్రజల సదుపాయాలను సమర్ధవంతంగా వినియోగించు కొని సాధించే ఉత్పత్తులు, అందించే సేవలపై ప్రభుత్వ ప్రగతి ఆధారపడి ఉం టుం ది. ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఉపాధిని పొందేందుకు సహాయపడగలదే కాని ప్రజలందరికీ ఉద్యోగాలు కల్పించలేదు.

నిజానికి ప్రభుత్వం ప్రజల సమష్టి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు నెరవేర్చే క్ర మంలోనే ఉద్యోగాలూ, ఉపాధులూ సృ జింపబడుతాయి. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు ప్రజలకు అందితేనే ప్రజలకు అ భ్యుదయం కలుగుతుంది.. యువతకు ఉ పాధి కల్పన జరుగుతుంది. ఈ సత్యాన్ని విస్మరించిన ప్రభుత్వాలు.. యువతకు ఉ ద్యోగాలు ఇస్తామని హామీలిస్తూ అధికారంలోకి వస్తున్నాయి.

కష్టమైనా ఇక్కడొక స త్యాన్ని గ్రహించాలి.. గత 20 సంవత్సరాల కాలంలో దాదాపు 22 కోట్లమంది ప్ర భుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకుంటే.. ఏడు నుంచి ఎనిమిది లక్షల మం ది మాత్రమే ఉద్యోగాలను పొందారని చెపుతారు. అయితే మిగతా వారంతా అసమర్ధులు కారు. 

ఉద్యోగ భద్రత

లక్షల కొద్ది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నా.. వందమందిలో ఒకరికో ఇద్దరికో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలు సాధించలేని యువతలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, నిరాశా నిస్పృహలకు గురౌతున్నారు. నైతికత తగ్గుతున్నది. ఆత్మగౌరవం పలచబారుతున్నది. అపారమైన వారి శక్తిసామర్ధ్యాలు నిర్వీర్యమై సమాజానికి నిరుపయోగం అవుతున్నాయి.

ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకై పోటీ పడ డానికి కారణం ఏమిటి? ప్రభుత్వ కొలువొక సౌకర్యవంతమైన వలయం.. భద్రత ఉంటుంది. పని తక్కువ, వేతనాలు అధి కం. ప్రైవేటు రంగంలో అదే పనికి 100 రూపాయల వేతనం ఉంటే.. ప్రభుత్వాలు 180 రూపాయలపైగా చెల్లిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో లాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నైపుణ్యాలు అనునిత్యం పెంచుకోక పోతే ఉద్యోగాలు కోల్పోరు. జవాబుదారీతనం లేకపోవడం, ఉద్యోగ భద్రత నిర్లక్ష్యా న్ని పెంచుతుంది.

వ్యవస్థాగత లోపాలు నిర్ణయాలను ఆలస్యం చేస్తుంటాయి. ప్రైవే టు రంగంలో విధంగా పనితీరును అంచనావేసే కఠినమైన ప్రక్రియలు లేకపోవడం, నిర్లక్ష్యానికి తగిన చర్యలు వెంటనే చేపట్టే అవకాశాలు లేకపోవడం ఉద్యోగులలో అలసత్వాన్ని పెంచుతూ.. సమస్యలను తీవ్రతరం చేస్తుంటాయి. రాజకీయ జోక్యా లు వారి పని సామర్ధ్యాన్ని తగ్గిస్తూ, స్వతం త్ర నిర్ణయాలను పరిమితం చేస్తుంటాయి.

ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్లక్ష్యంగా ఉం టారనే ప్రజల అభిప్రాయాలు కూడా ఉ ద్యోగుల సానుకూల వైఖరిని ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగు ల్లో ఎక్కువ మంది కష్టపడి పనిచేస్తూ... ప్ర జలకు సేవ చేసేందుకు ఉత్సాహం చూపేవారుంటారు. ప్రమాదకరమైన పరిస్థితు ల్లో తమ శక్తియుక్తులను పూర్తిగా వినియోగిస్తూ ప్రజలకు సేవ చేసేవారున్నారు.

ఉత్పాదకతా సామర్థ్యం

ప్రపంచంలో పనిచేయగలిగిన యువత అధికంగా కలిగినది భారతదేశం. దేశ జనాభాలో అధిక శాతం 25 సంవత్సరాల క న్నా తక్కువ వయసు వారున్నారు. వచ్చే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రభావవంతమైన, ఉత్పాదకతా సామర్ధ్యం కలి గిన యువత దేశానికి అందుబాటులో ఉం ది. అయితే జనాభాలో కనీసం 26 శాతం మంది సరైన విద్యను అభ్యసించకపోయి నా, నైపుణ్యాలు పెంచుకోలేకపోయినా వా రిని పోషించడం, ఉపాధిని కల్పించడం ప్ర భుత్వాలకు అలవికానిపని.

ప్రజలకు ఆ శలు కల్పించి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలు ప్రభుత్వాలపై ఆధారపడేట్లుగా ప్ర వర్తించే ఏ ప్రభుత్వమూ అభ్యుదయాన్ని సాధించలేదు. ప్రజల సమష్టి అవసరాలను తీర్చడానికే ప్రభుత్వం, కాని ప్రజల వ్యక్తిగత అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వమని భావించలేము. విద్య, ఆరో గ్యం, వసతుల కల్పనలపై ప్రభుత్వం దృష్టి పెడితే లక్ష్యం నెరవేరుతుంది.

ప్రజలు వారి ప్రయోజనాలను గుర్తించడం, వాటిని సాధించాలనే తీవ్రమైన కోరిక, పట్టుదల, తపన వివిధ సమస్యలపై వారి స్పందన లు, పరిష్కార దిశలో వారి సృజనాత్మకత, సమస్యలను అధిగమించడంలో ఉపకరిస్తాయి. ఆత్మగౌరవం, శ్రమను గౌరవిం చడం, విలువలతో కూడిన సేవలను అం దించడం, నాణ్యత కలిగిన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం.. నాణ్యమైన విద్యను అందించడం లాంటి  వసతులపై దృష్టిని కేం ద్రీకరించిన ప్రభుత్వాలను పరిణత ప్రభుత్వాలుగా చెప్పు కోవచ్చు.

భార త్‌లో పాఠ శాలల నుంచి బయటకు వచ్చి న విద్యార్థుల్లో 5 శాతం కన్నా తక్కువ మందిలో ఆ స్థాయికి తగిన నైపుణ్యాలు ఉన్నట్లుగా నివేదికలు చెపుతున్నాయి. పాఠశాల విద్యలో అధికభాగం.. అనవసరమైన విషయాలను కంఠస్థం చేసేం దుకు ఉపక రిస్తుందే కాని నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవ డంలో ఉపకరించదు. అలాంటి విద్యా విధానం నిరుద్యోగులను తయారుచేస్తుం దే కాని ఉపాధి హామీని ఇవ్వలేదు. ప్రభుత్వాలు.. ఈ సమస్యలపై దృష్టిని కేంద్రీక రించి ప్రజల ను సరైన మార్గంలో నడిపిస్తే దేశ భవిత ఉజ్వలమై ప్రపంచానికి చిరకా లం మార్గదర్శన చేయగలుగుతుంది.