29-10-2025 09:53:28 AM
ఆటోను తప్పించబోయి గుంతలోకి ఆర్టీసీ బస్సు
ప్రయాణికులు, విద్యార్థులు సురక్షితం
మునిపల్లి,(విజయక్రాంతి): సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజు మాదిరిగా సదాశివపేట నుంచి మండలంలోని బోడపల్లి గ్రామానికి వచ్చి ప్రయాణికులు, విద్యార్థులు తీసుకెళ్తున్నది. బుధవారం సదాశివపేట నుంచి బోడపల్లికి వచ్చి ప్రయాణికులు, విద్యార్థులను ఎక్కించుకొని సదాశివపేటకు(Sadashivapet) వెళ్తున్న క్రమంలో ఖమ్మంపల్లి నుంచి మునిపల్లి కి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఒక్క సారిగా పక్కనే గుంతలోకి వెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యార్థులు చదువుకునేందుకు ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు మునిపల్లి మోడల్ స్కూల్ కు వెళ్తున్నందున వారు నడుచుకుంటూ వెళ్లడం అందరికి ఆశ్చర్యానికి గురి చూసింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగా బయట పడడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.