calender_icon.png 29 October, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలంలో భారీ వర్షం.. బస్సుల రాకపోకలకు అంతరాయం

29-10-2025 09:50:07 AM

హైదరాబాద్-శ్రీశైలం వైపు బస్సుల రాకపోకలకు అంతరాయం.

శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.

నల్లమల రహదారుల్లో పొంగిన వాగులు.

వాగు ఉదృతికి నిలిచిన రాకపోకలు.

హైదరాబాద్: శ్రీశైలంలో(Srisailam) నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి అర్ధరాత్రి లింగాలగట్టులో రెండు ఇళ్లు కూలిపోయాయి. నదీ పరివాహక ప్రాంతంలోని గృహాలు కోతకు గురయ్యాయి. శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో(Srisailam Dam Ghat Road) కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్- శ్రీశైలం వైపు బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దోర్నాల-శ్రీశైలం, దోర్నాల-ఆత్మకూరు నల్లమల రహదారుల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. పెద్దదోర్నాల-మార్కాపురం రహదారిలో తీగలేరు వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి.

అటు నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుకొండ, కల్వకుర్తి, వెల్దండ, ఆమన్ గల్, వంగూర్, చారగొండ మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జిల్లాలో మందవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచాయి. చారకొండ మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు ఉధృతికిఎర్రవల్లి- గోకారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కల్వకుర్తి మండలంలో రఘుపతిపేట వద్ద దుందుభి వాగు ఉధృతికి రాకపోకలు నిలిచాయి. అచ్చంపేట-శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్ర వాగు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.