01-09-2025 01:02:51 AM
* పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
కల్వకుర్తి ఆగస్టు 31: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదారుల బారిన పడుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నియంత్రించేందుకు పోలీసు లు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచినా వాహనదారుల్లో మాత్రం మార్పు కని పించడం లేదు. న్యాయమూర్తులు జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించినా ఏమాత్రం లెక్కచేయడం లేదు.
శిక్ష విధిస్తున్నా...
గతంలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానా విధించి వదిలేసేవారు. ప్రస్తుతం పోలీసులు కోర్టులో హాజరు పరుస్తుండగా న్యాయమూర్తులు తాగిన మోతాదు ఆధారంగా జరిమా నాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు. అయినప్పటికీ మార్పు కనిపించడం లేదు. జిల్లా లోని నాలుగు నియోజకవర్గంలో నిత్యం పోలీసులు తనిఖీలు చేస్తూ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు.
ఇందులో అధికంగా పెద్దకొత్తపల్లి, కల్వకుర్తి మండలాల్లో ఎక్కువ కేసులు నమోదు జరుగుతున్నాయి. పట్టు బడిన వారు శిక్షను అనుభవించి మళ్లీ పట్టుబడుతుండడం విశేషం. జిల్లాలోని నాలుగు నియోజకవర్గ పరిధిలో గత సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుమారు 3,960 కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా కల్వకుర్తి, పెద్దకొత్తపల్లి, నాగర్ కర్నూల్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి. కల్వకుర్తి కోర్టులో సుమారు 50 మందికి పైగా శిక్ష వహించినప్పటికీ నిత్యం పోలీసుల తనిఖీల్లో ఇంకా కట్టుబడుతూనే ఉన్నారు.
నిత్యం తనిఖీలు చేస్తున్నాం..
మద్యం తాగి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడటంతో పాటు ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నందున నిత్యం తనిఖీలు చేస్తూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని న్యాయమూర్తి వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు.
మాధవరెడ్డి.ఎస్‌ఐ,కల్వకుర్తి.