01-05-2025 01:56:51 AM
కామారెడ్డి, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన ఆర్కిడ్స్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించారు. బుధవారం వెలువడిన ఫలితాల సందర్భం గా ఆర్ కిడ్స్ పాఠశాల కరాస్పెండెంట్ చైర్మ న్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం 48 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందు లో 100% ఉత్తీర్ణులు కావడం గర్వకారణం అని అన్నారు.
ఈ ఫలితాలలో ప్రధమనకు సాధించిన శ్రీ లాస్య 600/576, కే మేదశ్రీ 600/568, వర్షిత 600/566, కే అక్షయ్ 600/566, ఎన్ రిత్విక్ 600/560 మరి యు 550 పైగా మార్కులు సాధించిన తొ మ్మిది మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు 500 పైగా మార్కులు పొందిన విద్యా ర్థులు సుమారు 35 మంది విద్యార్థులు ఉన్నారని ఈ పాఠశాలలో చదివిన 48 మందిలో 100% మార్కులు సాధించిన ఘనత ఆర్కిడ్స్ పాఠశాలకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆర్కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ , చైర్మన్ సిహె గోవర్ధన్ రెడ్డి, కరాస్పండెంట్ ఎం జైపాల్ రెడ్డి, డైరెక్టర్ ఎం సదాశివరెడ్డి, విద్యార్థుల కృషికి ఉపాధ్యాయుల మార్గ నిర్దేశ నంకు తల్లిదండ్రుల సహకారానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.