ప్రేమకు వయస్సు అడ్డొస్తే..?
17-03-2026 12:00 AM
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర ప్రపంచాన్ని ఈ టీజర్ ద్వారా పరిచయం చేశారు మేకర్స్. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు.
కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; ఛాయాగ్రహణం: నిమిష్ రవి; కూర్పు: నవీన్ నూలి; కళ: బంగ్లాన్.




