calender_icon.png 10 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోహీరోయిన్లు కనిపించకుండాపోతే..?

10-08-2025 12:45:36 AM

బాలు నాయుడు, ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘అరణ్య ధార’. కథానాయకుడు బాలు నాయుడు మరో దర్శకుడు శివ పచ్చతో కలిసి దర్శకత్వ బాధ్యతల్లో పాలుపంచుకుంటూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌షాట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో రేవతి నాధ, వెంకట్ పసుపులేటి, నాయకంటి శ్వేతాంజలి, ప్రసాద్ పూసల, సంజయ్ సముద్రాల, జంజుర్ నిఖిల్, శివ పచ్చ వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్‌గా ‘యుగానికే ప్రయాణమే’ అనే పాట రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ‘ది 100’ సినిమా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో ట్రైలర్‌ను కట్ చేశారు. హీరోయిన్ అదృశ్యమవటంతో పోలీస్ అయిన ఆమె తండ్రి హీరోను అరెస్ట్ చేసి విచారించడం.. తర్వాత అనూహ్యంగా హీరో కూడా మిస్ అయి, అడవిలో పడటం వంటి అంశాలతో ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉంది. ఈ చిత్రానికి సంగీతం: రవి నిడమర్తి; సినిమాటోగ్రఫీ: చైతన్య దామెర్ల.