calender_icon.png 10 August, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవుతనిక అల్లుడే..

10-08-2025 12:47:45 AM

హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీకి రామ్ దేశిన (రమేశ్) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగశౌర్య జోడీగా విధి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేశ్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీవైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘నా మావ పిల్లనిత్తానన్నాడే..’ను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. హారిస్ జయరాజ్ స్వరపర్చిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా కారుణ్య, హరిప్రియ ఆలపించారు.

‘నా మావ పిల్లనిత్తానన్నాడే.. నేనే నెత్తిమీద బెల్లమెట్టి అవుతనిక అల్లుడే..’ ఈ పాటలో నాగశౌర్య, విధి కెమిస్ట్రీ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ డీవోపీగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.