calender_icon.png 15 September, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరాస ప్రేక్షకపాత్రలో ఔచిత్యమెంత?

22-06-2025 12:00:00 AM

చలాది పూర్ణచంద్రరావు :

కొన్నేళ్లుగా ప్రపంచంలో యుద్ధాలు వివిధ దేశాల మధ్య జరుగుతున్నా అడ్డు కోవలసిన యుఎన్‌ఓ అసలు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఇది వాస్తవం కూడా. ఈనెలలో ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య అత్యంత భయానకంగా మొదలైన యుద్ధాన్ని కూడా నిలువరించే ప్రయత్నాలను ఐరాస చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.

మానవుని మనుగడ కోసం వనరులకు మరింతగా అవసరాలు తీర్చేందుకు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని గ్రహాంతరాల కు వెళ్లి మరీ ఖనిజాలు, నీటి వనరులు తదితర ప్రకృతి వనరులు కనుగొనే ప్రయత్నం చేస్తుంటే అదే పరిజ్ఞానం వినియోగించుకొని భూమండలంలో కొన్ని దేశాలు యుద్ధం పేరుతో విధ్వంసం సృష్టి స్తూ మానవ వినాశనం కోరుకోవటం క్షమించరాని నేరం.

అసలు యుద్ధం అంటేనే ఒక అనాగరిక చర్య. ఇలాంటి అనాగరిక వ్యవస్థలో వున్న కొన్ని దేశాలను యుద్ధం నివారించేందుకు మరికొన్ని మా నవ సంక్షేమ కార్యక్రమాలకు భిన్నంగా మారకుండా ఉండే లక్ష్యంతో అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి (యుఎన్‌ఓ) ఏర్పాటైంది. అయితే కొన్నేళ్లుగా ప్రపంచంలో యుద్ధాలు వివిధ దేశా ల మధ్య జరుగుతున్నా అడ్డు కోవలసిన యుఎన్‌ఓ అసలు పట్టించుకోకుండా ప్రేక్ష క పాత్ర వహిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఇది వాస్తవం కూడా. 

ఇజ్రాయిల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సుమారు రెండేళ్లుగా జరుగు తున్న యుద్ధంలో ఆస్తి ప్రాణ నష్టాలు దా రుణంగా సంభవిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకపోగా ఈనెలలో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య అత్యంత భయానకంగా మొదలైన యుద్ధాన్ని కూడా ఐరాస పట్టించుకు న్నట్టు కనిపించడం లేదు. పైగా రగులుతున్న రావణకాష్టంలో ఐరాసలో శాశ్వత సభ్యత్వం కలిగిన అగ్రదేశాలు మరింతగా ఆజ్యం పోస్తూ యుద్ధాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేయటం మరింత విషాదకరం. 

ఏడున్నర దశాబ్దాల చరిత్ర

ఐక్యరాజ్యసమితి స్థాపనకు ముఖ్య కారణం పరిశీలిస్తే అసలు విషయాలు బోధపడతాయి. ఐరాస రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 అక్టోబర్ 24న అధికారికంగా ప్రారంభమైంది. దాని చార్టర్‌ని చైనా, ఫ్రాన్స్, సోవియట్ యూనియ న్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాలకు సంతకం చేసి, వారు ఆమోదించిన తరువాత ఉనికిలోకి వచ్చింది.

ప్రస్తుతం 75 సంవత్సరాలు గడచినా తొలుత రూపొందించిన చార్టర్ ప్రకారం అంతర్జాతీయ శాంతిభద్రతలు కాపాడటం, అవసరమైన వారికి మానవతా సహాయం చెయ్యటం వంటివాటితో పాటు మానవ హక్కులు పరిరక్షించటానికి కృషి కూడా ఐరాస ఆధ్వర్యంలో పెద్దగా జరగడం లేదు. అంతర్జాతీయ చట్టాలను నిలబెట్టే దిశగా ఆశించిన మేర ఆ సంస్థ అంతగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

అంతర్జాతీయ శాంతి కి ముప్పు ఉందా లేదా దురాక్రమణ చర్య ఉందా అని నిర్ణయించడానికి ఏర్పాటైన 15 మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి సభ్యులు వుంటారు. అంతర్జాతీయ శాంతి భద్రతలు కాపాడటం ఈ మండలి ముఖ్య భాద్యత. వీరంతా ఒక్కో ఓటును కూడా కలిగి ఉంటారు.

వీరు ఆదేశించిన నిర్ణయాలను అన్ని సభ్యదేశాలు పాటించాల్సి వుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ భద్రతామండలి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించటానికి లేదా పునరుద్ధరించటానికి అంక్షలు విధించటానికి లేకుంటే బల ప్రయోగం చేసి కాపాడే అధికారాన్ని సైతం కలిగి వుంది. 

ఆ అయిదు దేశాల కనుసన్నల్లోనే!

ఈ ఆర్థిక సంవత్సరం ఈ భద్రతామండలిలో సభ్యులుగా మనకు అత్యంత శత్రువైన పాకిస్థాన్‌తో సహా పన్నెండు దేశాలు వున్నాయి. అవి అల్జీరియా, చైనా, డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, గయాన, పనామా, రిపబ్లిక్ కొరియా, రష్యా, సియెర్రా లియోన్, స్లోవేనియా దేశాలు వున్నాయి. అక్షరమాల ప్రకారం ఒక్కొక్క నెల ఒక్కో సభ్య దేశం మండలి అధ్యక్ష పదవిని నిర్వహించటం జరుగుతుంది.

అయినా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వ త సభ్యతం కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లు. కాగా ఈ దేశాలు అతిముఖ్య తీర్మానాలకు సంబంధించిన ఓటింగ్‌లో వీటో అధికారం కలిగి ఉన్నాయి. దాంతో ఈ ఐదు దేశాలు ‘ఆడిందే అట పాడిందే పాట’ అని చెప్పాలి. ఈ శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మిత్రదేశాలుగా ఉండి ఆ యుద్ధంలో విజేతలుగా నిలిచాయి.

నాటి నుంచి ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాలను నిర్వహిస్తున్నాయి. అలాగే, ప్రపంచం లోనే 10 అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుల జాబితాలో ఈ ఐదు దేశాలు వున్నాయి. ఇంకా అనేక మౌలిక సిద్ధాంతాలతో ఏర్పాటైన ఈ ఐక్యరాజ్యసమితిలో సుమారు పదివేల మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. అయినప్పటికీ యుద్ధం పేరుతో రగులుతున్న పలు దేశాల్లో జోక్యం చేసుకోవటానికి ఐక్యరాజ్యసమితి ముందుకు రాలేని స్థితి. కారణం ఈ ఐదు శాశ్వత సభ్యదేశాలు ‘తానా అంటే తందాన అనటమే’ అనే ఆరోపణలు వున్నాయి. 

ఆర్థిక సంక్షోభం మరోవైపు!

పైగా, 2019 జూన్ 13న ఐక్యరాజ్యసమితి వచ్చే 2030 నాటికి ప్రపంచ ఆర్థిక నివేదికను సుస్థిర పరిచే అజెండాని వేగవంతం చెయ్యటానికి సంతకాలు చెయ్య టం జరిగింది. అయితే, సభ్య దేశాలు 2025 నాటికి కూడా సభ్యత్వం చెల్లింపులో జాప్యం చేసిన కారణంగా సమితి ఆర్థిక సంక్షోభంలో వుంది.

వీటిలో ముఖ్య సభ్య త్వం కలిగిన యునైటెడ్ అమెరికా  తరచూ కావాలని యునైటెడ్ నేషన్స్‌ని ప్రభావితం చెయ్యటానికి సభ్యత్వ చెల్లింపుల్లో ఆలస్యం చేయటంతో ఇతర దేశాలు కూడా దీన్ని అనుకరించి సభ్యత్వం చెల్లించటంలో అల క్ష్యం చెయ్యటం జరుగుతోంది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. చివరికి మొత్తం 193 సభ్య దేశాలకుగాను గత మే19 నాటికి కేవ లం 61 దేశాలు తమ బకాయలను పూర్తి గా చెల్లించటంతో కొంత ఆర్థిక స్థితి మెరుగయ్యింది.

కాగా, శాశ్వత సభ్యత్వం వున్న ఐదు దేశాలు మానవాళికి ముప్పు కలిగించే యుద్ధం సంభవించినప్పుడు దానిని నివారించేందుకు జోక్యం చేసుకోవు. కారణం వాటి ఆయుధ ఉత్పత్తుల వ్యాపారం జో రందుకోవాలనేది దాని వెనుక వున్న ప్రధాన లక్ష్యం అన్నది నిపుణుల విశ్లేషణ. ఇవి అన్నీ పరిశీలిస్తే యుద్ధాన్ని ఆపలేని ఐక్యరాజ్యసమితి చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తున్నది. ‘ఎవరి దారి వారి ని వారు చూసుకోమనే’ ఉద్దేశ్యంతో వున్న ఆ అంతర్జాతీయ సంస్థ ‘వుంటేమి లేకుంటే నేమి’ అని అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయి.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, 

సెల్: 9491545699