24-09-2025 12:00:00 AM
భారతదేశంలో పరిపాలన సమర్థవంతంగా నిర్వహించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖలతో పాటు రాజ్యాంగబద్ధమైన సంస్థల పాత్ర గణనీయమైనది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రాణాధారమైన ఎన్నికల నిర్వహ ణ.. ముఖ్యంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తరుణంలో పాలక, ప్రతిపక్షాలు సైతం ఎన్నికల సంఘం నిజాయితీని, నిబద్ధతను పరిశీలించి దానిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కా నీ ఇటీవల కాలంలో పాలక పక్షాలే రా జ్యాంగబద్ధ సంస్థలను ముఖ్యంగా సీబీఐ, ఈడీ, ఎన్నికల సంఘం (ఈసీ) సహా ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదనే ఆరోపణ స్పష్టంగా వినబడుతున్న ది.
దానికి మరింత ఆజ్యం పోసే విధంగా ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పో షించడం గమానార్హం. అదీగాక ప్రశ్నించిన వాళ్లను అధిగమించే స్థాయిలో సమాచారాన్ని ఇవ్వకుండా నిర్ణీత గడువు తర్వాత ధ్వంసం చేస్తామని చెప్పడం ఆందోళన క లిగించే అంశం. గత వారం రోజులుగా ఈ అంశంపైన రోజుకొక కథనం వెలువడుతుంది. దీనికి తోడు గత నెల 7న లోక్‌స భలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై బహిరంగ ప్రకటన ద్వారా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ప్రజలందరూ వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందనడంలో సందేహం లేదు.
బీజేపీ తొత్తుగా మారి
ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలి పి దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నదని, ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా న కిలీ ఓటర్లను చేర్చడం అంటే పాలిత బీజే పీ పార్టీకి మేలు చేయడమేనని రాహుల్ అ న్నారు. బీజేపీ తొత్తుగా ఎన్నికల సంఘం పనిచేస్తే అది రాజ్యాంగబద్ధ సంస్థ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాజాగా వారం కిందట మరోసారి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. తన వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పి న రాహుల్.. సాఫ్ట్‌వేర్ సాయంతో ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని దు య్యబట్టారు. ఓట్లచోరీపై కర్ణాటక సీఐడీ 18 సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ లు రాసినప్పటికీ ఎలాంటి సమాచారం అందించలేదని ఆరోపించారు.
అంతకముందు బెంగళూరు సెంట్రల్ లోకసభ స్థానంపై దృష్టి పెట్టినట్లు.. మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిర్వహించిన పరిశోధన ద్వారా 6.5 లక్షల ఓట్లు ఉంటే అందులో లక్ష ఓట్లు నకిలీవేనని రాహుల్ స్పష్టం చేయడం అగ్నికి మ రింత ఆజ్యం పోసినట్లయింది. ఈ లోక్‌సభ స్థానంలో కేవలం బీజేపీ అభ్యర్థి తక్కువ మెజారిటీతో గెలవడం చూస్తే లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదవ్వడం ఎన్నికల అక్ర మాల కిందకే వస్తుందనేది రాహుల్ వాద న. మహదేవపురా నియోజకవర్గంలో 11, 965 మంది డూప్లికేట్ ఓటర్లు, చెల్లుబాటు కానీ చిరునామాతో 40 వేల మంది ఓటర్లు, బల్క్ లేదా ఓకే చిరునామాతో 10,452 మంది, నకిలీ ఫోటోలతో 4,132 మంది ఓటర్లు ఉన్నారని.. మరొక 33,692 మంది ఫామ్ దుర్వినియోగానికి పా ల్పడ్డారు. తొలిసారిగా ఇంతమంది నకిలీ ఓటర్లు నమోదు కావడం అవినీతిలో భాగమే కదా అని రాహుల్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని నేరపూరిత మోసాలకు పాల్పడి రాజ్యాంగాన్ని, జాతీ య జెండాను అవమానించిందని రాహు ల్ గాంధీ తెలిపారు. ఈ విషయంలో న్యా య వ్యవస్థ జ్యోక్యం చేసుకొని అక్రమాలకు పాల్పడిన వారిపై, నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చిన వారిపై కఠిన చర్యలు అవసరమని డిమాండ్ చేశారు. అదే మా దిరిగా ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని కూడా రాహుల్ డిమాండ్ చేయడం కీలకంగా మారింది. తన ఆరోపణలకు ప్రమా ణ పత్రం జతపరచాలని ఎన్నికల సంఘం చేసిన సూచనపై రాహుల్ స్పందిస్తూ.. ‘తన సంతకంతో చేసిన డిక్లరేషన్ అవసరం లేదని.. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సమక్షంలో బహిరంగంగానే మా ట్లాడుతున్నప్పుడే నా మాటలను ప్రమాణంగా తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. అంతేకాదు తన సూచన ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావా ల్సిన అవసరం ఉందన్నారు.
నకిలీ ఓట్ల ద్వారా ఎన్నికల వ్యవస్థను చోరీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. సీసీటీవీ ఫుటేజీ, ఓటర్ల జాబితాలోని సా క్ష్యాలను ఎన్నికల సంఘం భద్రపరచకుండా ఎప్పటికప్పుడు నాశనం చేయడం అంటే తప్పించుకోవడం కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘా నికి సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తూ.. ‘ఈ తప్పులకు భవిష్యత్తులో అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడున్న ప్రతిపక్షం ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తుందని, అప్పుడు మేము ఏం చేస్తామో మీరే చూస్తారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిం దని, నరేంద్ర మోదీ 25 లోక్‌సభ సీట్లు చోరీ చేసి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ లోక్‌సభ ఎంపీ సీట్ల కు సంబంధించి 25 స్థానాల్లో 33 వేల కం టే తక్కువ మెజారిటీతోనే గెలిచింది.
దీం తో అప్పటి సార్వత్రిక ఎన్నికలపై ప్రజల్లో ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నా యి. ప్రజా వ్యతిరేకత అనేది ప్రతి రాజకీయ పార్టీ ఎదుర్కొనే సవాల్.. కానీ బీజేపీ కి మాత్రం ఈ సవాలు ఎదురు కావడం లేదు. పైగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కంటే భిన్నమైన ఫలితాలు రావడంతో పాటు అందరి అంచనాలు తప్పు తున్నాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమి టి? ఎన్నికల్లో ఇప్పుడు కొరియోగ్రఫీ జరుగుతుంది’ అని రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేయడంపై దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రజ ల జాగరూకతపైన ఆధారపడి ఉంటుంద ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారన్న విషయం మరువద్దు.
విచారణకు సిద్ధమవ్వాలి
ఎన్నికల సంఘం తగిన విచారణకు సిద్ధపడాలి. అదే సమయంలో ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం ద్వారా తన నిజాయితీని చాటుకోవాల్సిన సంద ర్భం ఇది. కానీ దానికి భిన్నంగా ఎన్నికల సంఘం ప్రవర్తన ఉంది. తప్పుడు ఆధారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, ఆరోపణకు రుజువుగా ప్రమాణం చేయగలరా అని రాహుల్‌ను ఈసీ ప్రశ్నించడాన్ని గమనిస్తే పక్కదారి పట్టించడమే అవుతుందన్నది వాస్తవం. మీ ఆరోపణ నిజమని రుజువు చేయగలిగితే ప్రమాణం చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసరడంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ లోని రూల్ 20 (3) బి ప్రకారం ప్రమా ణ పత్రంపై సంతకం చేయాలని.. లేదంటే ఆధారాలు లేని ఆరోపణలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొనడంపై కూడా ప్రజలు దృష్టి సారించాలి.
ఇక ప్ర స్తుత కేంద్ర ప్రభుత్వం బిజేపీ నాయకత్వంలోని మంత్రులు కొందరు భారత ప్రజా స్వామ్యం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాం గ్రెస్ పార్టీ అతిపెద్ద కుట్రకు పాల్పడుతుందని రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లుగా ప్రకటించడం విడ్డూరం. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి సమగ్ర విచారణకు ఆ దేశిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనిపించేలా లేదు. ఇదే సందర్భంలో ప్ర జలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు.. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు పలుకుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే పూర్తిస్థాయి విచారణ సాధ్యమవుతుంది.