calender_icon.png 27 September, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ నోబెల్ ఆరాటం!

25-09-2025 12:00:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చేదాకా తన గొప్పలు చెప్పుకోవడం ఆపేలా లేరు. ప్ర పంచంలో ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలను తాను ఆపానని, తనకు నో బెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనంటూ వితండవాదం చేయడం ఆయనకే చెల్లింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా..

ప్రపంచంలోని యుద్ధాలన్నీ తానే ఆపానంటూ పదేపదే పేర్కొనడం, వీలు చిక్కినప్పుడల్లా  తనను తాను పొగుడుకోవడం పరిపాటిగా మార్చుకున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలోనూ ట్రంప్ అదే గొంతుకను వినిపించడం గమనార్హం. పైగా యు ద్ధాలను ఆపడంపై జరిఇన చర్చల ప్రక్రియలో ఐక్యరాజ్యసమితి నుంచి ఎ లాంటి సాయం అందలేదని,

కనీసం యుద్ధాలను ఆపేందుకు తాను చే స్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఐక్యరాజ్యసమితి నుంచి ఒక్క ఫోన్‌కాల్ కూడా రాలేదని పరోక్షంగా దుయ్యబట్టారు. ఆ సంస్థవి ఉత్త మా టలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో భారత్ యుద్ధంపై మరోసారి పాతపాటే పాడారు. అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, అదొక్కటే కాదని కంబోడియా కొసావో కాంగో భారత్ ఇజ్రాయెల్ ఈజిప్ట్ ఆర్మేనియా ఇలా ఏడు యుద్ధాలను ఆపానని ఐక్యరాజ్యసమితి సభ వేదికగా ప్రకటించుకున్నారు. అంతటితో ఆగని ట్రంప్ తన దేశం గురించి గొప్పగా చెప్పుకున్నారు.

అమెరికా గొప్ప దేశమని, రెండోసారి పదవి చేపట్టాక అమెరికాలో మార్పు వచ్చిందని, ఇది తమ దేశానికి స్వర్ణ యుగమని భుజాలు ఎగరేశారు. అయితే రష్యా యుద్ధాన్ని ఆపలేకపోవడాన్ని కప్పిపుచ్చుకున్న ట్రంప్ ఆ నిందను భారత్, చైనాలపై మోపడం విడ్డూరంగా అనిపించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్, చైనా నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించడం ట్రంప్‌కే చెల్లింది.

నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనాన్ని, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఆపడం లేదని, రష్యా కూడా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా లేనట్టుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల సం దర్భంగా జెలెన్ స్కీతో సమావేశమైన ట్రంప్ రష్యాపై తన స్వరం మార్చినట్లుగా అనిపిస్తుంది. మూడున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం రష్యాను ఒక ‘పేపర్ టైగర్’గా మార్చేసిందన్నారు.

నాటో కూటమి దేశాల గగనతల సరిహద్దులను ఉల్లఘించి రష్యా ఫైటర్ జెట్లు దూసుకురావడాన్ని తప్పుబట్టిన ట్రంప్ అవసరమైతే రష్యా విమానాలను కూల్చేస్తామని హెచ్చరించారు. తమ మిత్రదేశం ఇజ్రాయెల్ హమాస్‌పై కొనసాగిస్తున్న విధ్వంసకాండను ట్రంప్ సరైనదిగానే అభివర్ణించడం గమనార్హం. గాజా సిటీపై భీకర దా డులు చేస్తుండడంతో అమాయక పాలస్తీనా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న దృశ్యాలు ట్రంప్ కంటికి ఆనడం లేదు.

పాలస్తీనాను ఇటీవలే దే శంగా గుర్తించేందుకు ముందుకు వచ్చిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలపై పరోక్షంగా విరుచకుపడ్డారు. ఉగ్రవాదులను, అమాయక జనాన్ని ఒకే పం చన చేర్చి గాజాలో నరమేధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆటలు ట్రంప్‌కు కనిపించడం లేదు. నక్కలమారి జిత్తు అనిపించుకున్న ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? రాదా? అనేది వేచి చూడాల్సిందే.