calender_icon.png 27 September, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యుదయం అహంకారాన్నిస్తే

24-09-2025 12:00:00 AM

జ్యాయస్త్వే చాపి లబ్దార్థః సమో విపరికల్పతే, అభ్యుచ్చితశ్చా విశ్వాస్యో వృద్ధిశ్చిత్తవికారిణీ!

(కౌటిలీయం 7 మనతో సమానమైన వాడు కూడా కా ర్యాన్ని సాధించిన సమయంలో బలవంతుడై విపరీతంగా లేదా అసహజంగా ప్రవర్తించవచ్చు. అభివృద్ధి చిత్తంలో వికారాన్ని పుట్టిస్తుంది గనుక అభివృద్ధి పొంది న వానిని విశ్వసించకూడదు అంటాడు ఆ చార్య చాణక్య. వికారానికి ఒక కారణం అ హంకారం కాగా.. తనను మించి పోతాడనే భయం మరొక కారణం. చుట్టూరా ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా.. భారతదేశం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది.

అలాగని నీతి నియమాలు, విలువలు కలిగిన భారతదేశ నాయకత్వం అహంకారాన్ని పొందడం లేదు. నీతి నియమాలు ఆత్మగతమైనవి. సామాజిక విలువలు ప్రక్రియ ఆధారితంగా సాగుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలు అభివృద్ధికీ, వికాసానికి ఊతమి స్తాయి. విజయం అభ్యుదయాన్నిస్తే.. ప్ర యోజనం సమాజ శ్రేయస్సుకు రూపమిస్తుంది. పరస్పరం పోటీపడే సంస్థలు లేదా దేశాల మధ్య సంబంధాలు పారదర్శకత, విశ్వాసం ప్రాతిపదికగా అనుకూలమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతాయే కాని అవసరాల ప్రాతిపదికగా ఏర్పడిన సంబంధాలు శాశ్వతంగా నిలవవు. అభివృద్ధి చెందిన వారిలో అహంకారం పొడ సూపితే అధికారాన్ని చూపిస్తారు. కోపా న్ని, ఆదుర్దాను, దర్పాన్ని ప్రదర్శిస్తారు. అలాంటి వారితో చేసుకున్న ఒప్పందాలను తిరిగి సమీక్షించుకోవడం ఉత్తమం. 

నాయకత్వ దక్షత  

ఏ రంగలోనైనా అభ్యుదయం కావాలంటే.. వ్యవస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీతత్వం ఉండాలి.. సహకార స్వభావం ఉండాలి.. సమన్వయత ఉండాలి. సంయ మనతా ఉండాలి. అలా ఉండడం.. ప్రభావవంతమైన నాయకత్వం, సమర్ధ వంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందివ్వడం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, విభిన్న మార్గాలలో ప యనిస్తున్న వివిధ వ్యవస్థలను కలపడం.. నాయకత్వ దక్షతకు పరీక్షగా నిలుస్తుంది. అలా కలపడంలో పర్యవసానాలను పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ నిరంతరం ప్రభుత్వం పర్యవేక్షిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు.

ఆ ప్రయాణంలో నాయకునిలో ధైర్యం.. ధైర్యానికి తోడుగా మానవత్వం అవసరం. అలాగే సాధించగలననే నమ్మకం. దానితో పాటు గా దయాదాక్షిణ్యాలు అవసరం. బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహనా అవసరమే. వ్యక్తి కావచ్చు, దేశం కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు.. అభివృద్ధినే కోరుకుంటాయి. భారతదేశం కూడా ఒక్కొ క్క మెట్టు పైకెక్కుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాల్గవ స్థానానికి చేరుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మూడో స్థానానికి చేరుకుంటుందని నిపుణుల అంచనా. ఈ పరిణామాన్ని ప్రపంచ మంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నది. భారతదేశం ఎదిగితే దాని నీడలో ఎదుగవచ్చని ఆశతో చూసేవారు కొందరు.. భారతదేశ ఎదుగుదలను జీర్ణించుకోలేక ఈర్ష్యతో చూసేవారు కొందరు.. ఎదుగుదలను అపనమ్మకంతో చూచేవారు మరికొందరు.

ఎవరెలా చూస్తున్నా.. ఈ ఎదుగుదలకు పటిష్టమైన నాయకత్వం, ప్రోత్సాహాన్నిచ్చే ప్రభుత్వం ముఖ్య కారణాలుగా చెప్పుకోవాలి. దానికి తోడుగా సేవాభావన కలిగి, సాధించాలనే తపనతో పనిచేయగలిగిన యువత, కొనుగోలు శక్తి కలిగిన జనాభా(డెమోగ్రఫీ), విభేదాలెన్ని ఉన్నా సామర స్యంగా పరిష్కరించుకో జాలిన ప్రజాస్వామ్య వ్యవస్థ (డెమొక్రసీ), వైవిధ్యభరిత మైన జీవన విధానం (డైవర్సిటీ), సాంకేతికతను ఆహ్వానించే లక్షణం (డిజిటల్ పవ ర్), ప్రవాస భారతీయులు (డయాస్పొరా) అందించే సహాయ సహకారాలు భారతదేశ ప్రగతి ప్రస్థానంలో ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. అయితే ఇవి అప్పుడప్పు డు ప్రతికూల ఫలితాలనూ ఇవ్వవచ్చు. వా టిని నిరంతరం దగ్గరగా పర్యవేక్షించడం, లోటుపాట్లను సరిచేయడం అవసరం. 

పరీక్షలా ఉపాధి కల్పన 

అత్యధికంగాఉన్న యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వాలకు పెద్ద పరీక్షే. నిబద్ధత కలిగిన నాయకత్వం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తుంది. ప్రతిభకు పట్టం కడుతుంది. ఉద్యోగాలకై అర్రులుచాచడం గాక ఉ ద్యోగాలు కల్పించే నాయకులుగా ప్రజలను తీర్చిదిద్దుతుంది. అన్ని విధాన నిర్ణయాలకు, వాటి అమలుకు, పర్యవసానాలకు, జయాప జయాలకు నాయకుడే బాధ్యత వహిస్తాడు. అపజయాలకు అనుచరులను నిందించే నాయకుడు అభివృద్ధి చెందడు. తాను అనుసరించని విధానాలను కిందివారికి బోధించడం, వారి నుంచి ఆశించడం ప్రయోజనకరం కాదు. దార్శనికత (Vision), అవగాహన (Understan ding), స్పష్టత (Clarity), చురుకుదనం (Agility) కలిగిన నాయకత్వం విజయాన్ని వరిస్తుంది. అదే దుర్బలత్వం (Vulnerability), అనిశ్చితత్వం (Uncer tainity), సంక్లిష్టత (Complexity), సందిగ్ధత (Ambiguity) కలిగిన నాయకత్వం అపజయం పాలవుతుంది.

దీనిని VUCA లీడర్‌షిప్ అన్నారు. నూతనంగా ఆలోచించడం, కొత్త సాంకేతికతతో సంస్థలను స్థాపించడం, వాటి ప్రగతిని తరచుగా సమీక్షించడం వల్ల అభ్యుదయం కలుగుతుంది. ఈనాడు అభివృద్ధిని సాధిస్తున్న భారతదేశాన్ని చూసి అసహనాన్ని ప్రకటించే దేశాలు భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నో అడ్డంకులను కలిగిస్తున్నాయి. అయినా సంయమనంతో వాటిని అధిగమించి భారతదేశం అమెరికాతో బేరాలా డగలుగుతున్నది.. ఉత్పత్తిలో చైనాతో పోటీ పడగలుగుతున్నది.. రష్యాతో వ్యాపారం చేయగలుగుతున్నది. దానికి కారణం సంబంధిత రంగంలో అవకాశాలను, పరిణామాలను పరిశీలిస్తూ వేగంగా ముందుకు సాగడమే. ఫలితంగా గత త్రై మాసికంలో జీడీపీ 7.8 శాతం పెరిగింది. గత నెలలో యూపీఐ 20 బిలియన్ల లా వాదేవీలను దాటి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాం. దాని విలువ దాదాపు 24 లక్షల కోట్లు. సాంప్రదాయకతను, ఆధునికతను సమంగా ఆదరిస్తూ మారుతున్న సాంకేతిక విలువలను అందిపుచ్చు కోవడం, ప్రజలను, వివిధ రంగాలను ఒక్క దగ్గర కలపడం వల్ల ఉత్తమఫలితాలు ఆవిష్కృతమయ్యాయి.

అభ్యుదయమే మార్గంగా

అయితే మనలో శక్తిసామర్ధ్యాలు ఉన్నంత మాత్రాన.. ప్రభావశీలత ఉంటుందని చెప్పలేము. అలాగే.. అవకాశాలు వచ్చినంత మాత్రాన సాధించగలమనే పూచీకత్తునూ ఇవ్వలేము. స్వీయ బలాబలాలను తెలుసుకోవడం, మానవ వనరులను మూలధనంగా గుర్తించడం, అంతర్గత వ్యాపారావకాశాలను పెంచుకోవడం, అంతర్జాతీయ దృష్టి కోణంతో వ్యాపారావకాశాలను అవగాహన చేసుకోవడం, అవకాశాలకున్న పరిమితులను గుర్తించడం, వాటిని నెమ్మదిగా చెరిపివేసుకుంటూ ముందుకు సాగడమే అభ్యుద యాన్ని అందిస్తుంది. సహనం సౌశీల్యం ఆభరణాలుగా సాగుతున్న భారతదేశాన్ని ప్రపంచం విస్మరించలేదు.. అలాగే భారతదేశమూ ప్రపంచాన్ని విస్మరించలేదు. రత దేశ మేధ, విశ్వసనీయత, విపణి అవకాశాలు ప్రపంచానికి అవసరం.. అలాగే భారతదేశం కూడా ప్రపంచం నుంచి గౌరవాన్ని, అభివృద్ధిని, ఎదుగుదలలో భాగ స్వామ్యాన్ని, వ్యాపార అవకాశాలను కోరుకుంటున్నది. ఏదేమైనా భారతదేశ ప్రగతి నాపడం ఎవరికీ సాధ్యపడదు.

వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి