calender_icon.png 27 December, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, బీజేపీతో ఏం ఒరగదు

04-05-2024 01:53:11 AM

కాంగ్రెస్ గెలుపునకు సమిష్టిగా పనిచేయాలి 

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి 

రాజేంద్రనగర్, మే 03 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బీఆర్‌ఎస్, బీజేపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్, కేరళ ఎంపీ ఈడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారంలో కాంగ్రె స్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమనే భావనలో ప్రజ లు ఉన్నారని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను సాధిస్తామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎన్నికల ఇన్‌చార్జి రాజీరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ్మారెడ్డి, టీఎంఆర్‌ఈఐఎస్ అధ్యక్షులు ఎండీ ఫాహీమ్ ఖురేషీ, రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్ ఫాల్గొన్నారు.