04-05-2024 01:54:43 AM
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, మే 3 (విజయక్రాంతి): భారత్‌లో బీజేపీ వేవ్ నడుస్తుందని, లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దోమకొండ, కామారెడ్డి రూరల్, రాజంపేట్, బాన్సువాడ, వర్ని, చందూర్, మోస్రాలో పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారం, పార్టీ బూత్ లెవల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు సన్నగిల్లిందన్నారు. కానీ ప్రధాని మోదీ హామీలపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే గంగారాం పాల్గొన్నారు.