03-09-2025 06:50:41 PM
బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు ఎమ్మెల్యే అనిల్ వినతి
బోథ్,(విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలోని పలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో సెల్ నెట్వర్క్ సమస్యలపై బుధవారం హైదరాబాద్ లోని బీఎస్ఎన్ఎల్ సీజీఎంను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గల మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ లేక అవస్థలు పడుతున్నారని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నెట్వర్కులు లేని ప్రాంతాల్లో నూతన టవర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
నెట్వర్కులు ఉన్న గిరిజన ప్రాంతాల్లో టవర్లు సాంకేతిక లోపాల వల్ల నెట్వర్క్ సమస్యలు ఏర్పడుతున్నాయని అలాగే కొన్ని టవర్లకు విద్యుత్తు సౌకర్యం లేకపోవడంపై అవి పని చేయడం లేదని వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి సీజీఎం సానుకూలంగా స్పందించి కచ్చితంగా నెట్వర్క్ సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.