calender_icon.png 7 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి చచ్చిపోయాక...

30-06-2025 12:00:00 AM

కవి ఒకరోజు ఆత్ము వెళ్ళిపోతాడు...

ఇంట్లో పుస్తకాలే

నేస్తం వెళ్ళిపోయాడంటూ

నిజంగా రోదిస్తాయి  

రోజులు గడిచాక వారసులు లేక

పుస్తకాలు తూకానికి

చెత్త దుకాణానికి చేరిపోతాయి

పాఠకులు లేక ఉన్న పుస్తకాలతోనే 

గదులు నిండి ఈ కవి పుస్తకాలకు 

చోటు లేక ప్రేమున్నా గ్రంధాలయాలు 

రావద్దంటూ తలుపులు మూసేస్తాయి..

అపురూపంగా కవి దాచుకున్న 

అభినందన పత్రాలు జ్ఞాపికలు

చెత్తకుండీ పాలవుతాయి 

పట్టించుకునే వారు లేక బతికున్నప్పుడు 

పదిమందిని కూడి జట్టు కడితే సరి..

లేక పదిరూకలు వెంకేసుకుని ఉంటే సరి

ఒకటో రెండో సంతాప సభలు జరిగి

కవికోసం రెండు కన్నీటి 

బొట్లు రాలుస్తారు 

పల్లకీ మోసిన వారు..

ఇంట్లో పాత తరం పోగానే 

కవి ఊసే పోతుంది..

కవిత్మమే ప్రాణంగా బతికిన కవి

లోకం కోసం చేసిన సృజన

మానవీయ సూత్రాలు..

లోకాన్ని ఏలే నేతల ఆచరణకు 

ఎత్తుకుంటారా.. 

ప్రజలు తెలుస్తారా?

తన కోసం ఏ మనసు 

మీర వాడలేదని తెలిసాక

అటు ఇటు కాకుండా శూన్యంలో 

వేలాడుతున్నా కవి

ఆత్మ వెనక్కు తిరిగి చూడకుండా 

అనంత విశ్వంలోకి పయనమై 

అదృశ్యమవుతుంది!