28-11-2025 12:00:00 AM
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం కాదు. అది బీసీలను, ఎస్టీలను మోసంతో పాటు ద్రోహం చేసిన దినం. కాబట్టి దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక దినోత్సవంగా జరపాల్సిన అవసర ముం ది. ఎందుకంటే మన దేశంలో దాదాపు 60 శాతంగా ఉన్న బీసీలకు, 10 శాతము న్న ఉన్న ఎస్టీలకు వ్యతిరేకంగా అనేక అం శాల్లో గందరగోళాన్ని సృష్టించిన రాజ్యాం గ పరిషత్ సభ్యులు ఆ ప్రకారమే రాజ్యాంగాన్ని ఆమోదించారు.
దీనివల్ల ప్రజలు వారి దైనందిన జీవితంలో భాగమై వాడుకలో ఉండే పదాలైన కులాల పేర్లు కాకు ండా ఎవరికీ అర్థం కాని కష్టమైన పదాలను వాడి చాలా విధాలుగా అన్యాయా నికి గురయ్యేలా చేశారు. రాజ్యాంగంలో దోపిడీ, పీడనాన్ని నిరోధించే హక్కును (ఆర్టికల్ 23, 24) ప్రాథమిక హక్కుల్లో పేరుకే చేర్చారు తప్ప ఏ కోశానా దీనిని అమలు చేసేందుకు వీల్లేకుండా పోయిం ది. కనీసం న్యాయశాఖకు మొరపెట్టుకునే అవకాశం లేకుండా చేసి కేవలం అగ్రకులాల వారికే అన్ని అర్హతలు ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు.
ఏదో విధంగా న్యాయం జరగాలనే విషయాన్ని మభ్యపెట్టేందుకు ఆర్టికల్ 32 ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ నేటికీ న్యాయం మాత్రం అందరికీ సమానంగా దక్కడం లేదు. కంచె చేను మేసినట్టుగా రాజ్యాంగానికి మూల స్థంభాలైన ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల్లో బీసీలకు మొద టినుంచి సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నది వాస్తవం.
సామాజిక జీవనంలో అన్ని రంగాల్లోనూ ఇవాళ కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి కు లం ఈ దేశ ప్రజలు వద్దన్నా పోతలేదు. కా నీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 340లో వెనుకబడిన కులాలు అని స్పష్టంగా రాయడా నికి బదులు వెనుకబడిన తరగతులు/వర్గాలు అని అర్థం వచ్చేలా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) అని రాసి బీసీలకు ఎక్కడ స్థానం లేకుండా నమ్మకద్రోహం చేశారు.
నిలువు దోపిడీ..
దేశంలో మెజారిటీ శాతం ప్రజలు బీసీలే అయినప్పటికీ రిజర్వేషన్ల విషయం లో ఎందుకు పనికిరాని చట్టాలు తీసుకొ చ్చి నిలువు దోపిడీ చేస్తూనే వస్తున్నారు. బీసీ వర్గాలకు న్యాయంగా రావాల్సిన అవకాశాలను ఓపెన్ కాంపిటీషన్ పేరుతో జనరల్ కోటా అని చెప్పి అగ్ర-ఆధిపత్య కు లాల వారు ఆ ఫలాలను అధికంగా అనుభవించడానికి ప్రాధాన్యత కల్పించారు. ఆర్టికల్ 342(ఎ) ప్రకారం వెనుకబడిన తరగతులను లేదా వర్గాలను గుర్తించేందుకు రాష్ర్టపతికి, పార్లమెంట్ ద్వారా కేం ద్ర ప్రభుత్వానికి అధికారాలున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం కులగణన చేయలేదు.
కాకా కాలేకర్ కమీషన్ రిపోర్ట్ ఇచ్చి నా, మండల్ కమీషన్ సూచనలు చేసినా వాటిని తుంగలో తొక్కి కమండల్ ఉద్యమాన్ని ప్రారంభించి బీసీలను పక్కదారి పట్టించారు. ఇంతకాలం బీసీలకు ఏమీ చే యకుండా వారికి దక్కాల్సిన విద్యా, ఉద్యో గ, రాజకీయం సహా అన్నింటిలో పూర్తిగా ఓపెన్ లేదా జనరల్ కోటా పేరుతో ఆ అవకాశాలన్నింటినీ అగ్ర-కులాల వారు నిరభ్యంతరంగా అనుభవించడానికే ఆస్కా రం కల్పించారు.
ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం అని ఊదరగొట్టే మన పాలక వర్గాలు.. వారికి మద్దతిచ్చే అధిక శాతమున్న బీసీ వర్గాలను అణచివేసి జనాభా లో అతి తక్కువ శాతమున్న అగ్రవర్ణ ప్రజలకే తరతరాలుగా అధికారాన్ని ప్రజాస్వా మ్యం పేరుతో కట్టబెట్టి, చట్టబద్ధంగా లూ టీ చేయడానికి అవకాశమిచ్చారు.
గుడ్డిలో మెల్ల..
ఇక ఎస్టీల విషయానికొచ్చే సరికి రా జ్యాంగంలో ట్రైబల్ అనే పదాన్ని వాడి వారెవరో నిర్వచించకుండా మోసం చేశా రు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (25)లో షెడ్యూల్ తెగల నిర్వచనాన్ని ప్రస్తావించి దానిని ఆర్టికల్ 342లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం రాష్ర్టపతి.. రాష్ర్ట గవర్నర్‌ను సంప్రదించి ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ తెగలను నిర్ణయి స్తారు అని పేర్కొంటూ అందుకు ప్రాతిపదికలుగా..
ఆదివాసీ లక్షణాలు, భౌగోళిక ప్రత్యేకత, ప్రత్యేక సంస్కృతి, ఇతర వర్గాలతో కలవకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనాన్ని తీసుకున్నారు. కానీ ఒక వర్గాన్ని షెడ్యూల్ కులం (ఎస్సీ) గా గుర్తించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (24)లో ప్రస్తావిస్తూ అందుకనుగుణంగా ఆర్టికల్ 341లో నిర్వచనాన్ని పొందుపరచారు. అయితే దీనికి మాత్రం సామాజిక తీవ్ర వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటు, అంటరానితనం, వివక్షతో కూడిన ఆర్థిక వెనుకబాటుతనం లాంటి ప్రాతిపదికలుగా తీసుకున్నారు.
ఆయా రాష్ట్రాల్లో అంటరాని కులాలను గుర్తించి వారి కులా ల పేర్లను నిర్ణయించి జనాభా నిష్పత్తి మేర కు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎ లాంటి అవకతవకలకు ఆస్కారం లేకుం డా రాజ్యాంగంలో పొందుపర్చారు. తద్వా రా ఎస్సీలకు మాత్రమే సంపూర్ణ న్యా యం దక్కేలా చోటు కల్పించడం ఎస్టీల పాలిట శాపంగా మారింది. అడవుల్లో నివసించే గిరిజనులకు సంబంధించి కులాలు అని పేర్కొనకుండా కేవలం తెగలు అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. వారి జనాభా నిష్పత్తి ప్రకారం 7.5 శాతం వి ద్యా, ఉద్యో గ, చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం గుడ్డి లో మెల్ల అని చెప్పొచ్చు.
చట్టసభల్లోనూ అన్యాయం..
ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం ఏ రూపంలో ఉన్నా నిషేధించాలని రాజ్యాంగంలో పేర్కొనబడింది. అంటరానివారి కు లాలను మాత్రమే కులాలుగా గుర్తించి అటువంటి కులాలన్నింటిని ఒక షెడ్యుల్‌లో చేర్చి వారికి 15 శాతం విద్యా, ఉద్యో గ, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల ప్రకారం పార్లమెంట్‌లో, అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వారికిచ్చిన వాటా ప్రకారం మంత్రి పదవులు కేటాయిస్తూ వచ్చారు.
అయితే దేశంలో అధిక జనాభా ఉన్న బీసీలకు మాత్రం మంత్రివర్గంలో ముక్తసరిగా చోటు కల్పి స్తూ అన్యాయం చేస్తూనే ఉన్నారు. బీసీలతో పాటు గిరిజనులను కులాలుగా పేర్కొనకపోవడమనే ది ద్రోహం కిందే చెప్పొ చ్చు. ఈ నేపథ్యం లో రాజ్యాంగ దినోత్సవ సంబరాలు జరుపుకునే నవంబర్ 26ను బీసీలు, ఎస్టీలు విద్రోహదినంగా పాటించాల్సిన అవసరముంది. ఏది ఏమైనా ఎక్కువ శాతమున్న బీసీలకు అధికారాన్ని దక్కనీయకుండా చేయాలనే దురుద్దేశ్యంతో, కుట్రతో రాజ్యాంగాన్ని అందరూ కలిసి ఆమోదించడంతో పాటు తెలివిగా అందరూ కలిసి రాశారని ప్రవేశికలో పొందుపరిచారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అందరం సమానమే అని ప్రబోధించిన బ్రిటీష్ విద్యా విధానాన్ని చడీ చప్పుడు లేకుండా, ఎవరికీ అర్థం కాకుండా, స్పెషలైజేషన్ పేరుతో మార్చివేసి వర్ణ వ్యవస్థ కనుగుణంగా విద్యా వ్యవస్థను పునర్నిర్మించారు. కులం పోవడానికి రాజ్యాంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్న డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన పూర్తిగా కనుమరుగైపోయిందన్నది నిజం.
వ్యాసకర్త సెల్: 9849867032