28-11-2025 12:00:00 AM
బలహీన వర్గాల అనుమానమే నిజమైంది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం పాత పద్ధతితోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని జీవో నెంబర్ 46ని విడుదల చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో బలహీనవర్గాలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో మరోసారి ఆశాభంగం ఎదురైంది.
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత 2019లో మొదటిసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోతున్నా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను కాపాడలేకపోతే, స్థానిక సం స్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి ఎన్నికలు నిర్వహిస్తామనే హామీని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోలేకపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల కల్పనకి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల్లో బలం లేకపోవటం, బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరక్కపోవడం, తెలంగాణ పంచాయతీరాజ్ సవ రణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర లభించకపోవడం, జీవో నెంబర్ 9 కోర్టు కేసు ల్లో చిక్కుకపోవటంతో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన తరువాత మూడు వేల కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోతున్నామని రాష్ర్ట ప్రభుత్వం గ్రహించింది.
అందుకే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీని ఇస్తూ గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను అడ్డుకోలేం కాబ ట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్ల సాధనకు ఒకవైపు ఉద్యమిస్తూనే ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరముంది. అంతేగాక రిజర్వేషన్ల సాధనకే గ్రామస్థాయి నుంచి ఒక బలమైన సైన్యాన్ని తయారు చేసుకునే రాజకీయ వ్యూహానికి బలహీనవర్గాలు పదును పెట్టాలి.
రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం..
73, 74 రాజ్యాంగ సవరణల తరువాత 1994లో 243 (డి), 243 (టి) ఆర్టికల్ ప్రకారంగా గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. కానీ చట్టంలో బీసీలకు ఒక నిర్దిష్ట పరిమాణం లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అనే వి ఒక్కొక్క రాష్ర్టంలో ఒక్కో పరిమాణం లో కల్పించబడుతున్నాయి. 2010లో ట్రి పుల్ టెస్ట్ ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ ల రిజర్వేషన్ కోటా నిర్ణయించాలని సు ప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు మరింత ప్రమాదంలో పడినట్లయింది.
చట్ట ప్రకారంగా 50 శాతం పరిధిని దాటి ఒక రాష్ర్ట ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటరీ ప్రక్రియ ద్వా రా చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించాలి. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో రిజర్వేషన్లు లేని కులా లే లేవు. కాబట్టి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితికి కూడా అర్థం లేదు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన, ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కంటే ఎక్కువ రిజర్వేషన్లు లభ్యమవుతున్నప్పుడు, అడక్వేట్ ప్రాతిపదికన బలహీన వర్గాలకు విద్యా,
ఉద్యోగాల్లో, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరంతో పాటు, చట్టసభల్లో కూడా బలహీ నవర్గాలకు సరై న ప్రాతినిధ్యం దక్కటం లే దు కాబట్టి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. విద్య, ఉద్యోగా ల్లో, స్థానిక సంస్థ ల్లో రిజర్వేషన్ల పెంపుకి చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పనకు బలమైన ఉద్య మ నిర్మాణం జరగాలి. ఇప్పటినుంచి రిజర్వేషన్ల సాధన ప్రక్రియ ప్రారంభమైనా బీసీల ఓట్లు కావాలనుకునే పార్టీలు, ప్రభుత్వాలు 2028 రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల నాటికి రిజర్వేషన్ల అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశాలుంటాయి కాబట్టి చట్టబద్ధమైన రిజర్వేషన్ల సా ధనకు బలమైన ఉద్యమ నిర్మాణంతో పా టు లాబీయింగ్ ద్వారా కూడా లక్ష్యాల్ని సాధించాగలుగుతారు.
వ్యూహాత్మక ఎత్తుగడలు!
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 పైన తెలంగాణ రాష్ర్ట హైకోర్టు తీర్పు వెలువరించే సమయంలో ఎక్కడా పంచాయతీ ఎన్నికలను ఆపాలనే సూచన చేయలేదు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం కూడా పాత రిజర్వేషన్ల విధానం ప్రకారం.. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలను నిర్వహించడానికి ముం దుకెళుతున్న నేపథ్యంలో ఎలాగూ ఎన్నికలను ఆపలేని నిస్సహాయతతో రాష్ర్టం లో ని బలహీన వర్గాలు తమ ఎత్తుగడలను, వ్యూహాలను మార్చుకోవలసిన అవసర మున్నది.
పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్లతో సహా అన్ రిజర్వడ్ స్థానాలలో మెజార్టీ గ్రామ పంచాయతీలను గెలుచుకునే వ్యూహాలను బలహీన వర్గాలు రూపొందించుకోవాలి. పార్టీల పరంగా 42 శాతం ఇచ్చినా.. 56 శాతం ఇచ్చినా బలహీనవర్గాలు అన్ రిజర్వడ్ కేటగిరిలోని మెజార్టీ గ్రామ పంచాయతీలను గెలవగలిగితేనే భవిష్యత్తు రాజకీయాన్ని తమ వైపు కు తిప్పుకొనే శక్తిగా మార్చుకునే అవకాశం లభిస్తుంది.
సవాళ్ల రాజకీయం (‘రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందో చూస్తాం’ లాంటి సవాళ్లు ఈ తరుణంలో ఉపయోగపడవు) కంటే ఎత్తుగడ రాజకీయాలే భవిష్యత్తు బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తాయి, హక్కులను సాధించగలుగుతాయి, సమస్యలను పరిష్కరించగలుగుతాయని బల హీనవర్గాల సమాజం గుర్తించాలి.
బీసీలకు పరీక్షా కాలం..
తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 12,778 గ్రామపంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం రిజర్వేషన్‌తో 3,451 గ్రామపంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. అదే సమ యంలో 23 శాతం రిజర్వేషన్లు కలిగిన బీసీలకు 2,938 గ్రామ పంచాయతీలు రిజర్వ్ చేయబడితే.. మిగిలిన 50 శాతం అన్ రిజర్వడ్ కేటగిరిలో 6,389 గ్రామ పంచాయతీల్లో బీసీ సామాజిక వర్గం మరొక నాలుగువేల గ్రామ పంచాయతీలను గెలవగలిగితే జనాభా దామాషా ప్రకారంగా 56 శాతం ఉన్న బలహీన వర్గాలు 7 వేల మంది గ్రామపంచాయతీ ప్రెసిడెంట్‌లతో ఒక బలమైన సైన్యాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
గెలుపోటములను పక్కనపెడితే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన పంచాయతీలు పోను మిగిలిన 9,327 గ్రామపంచాయతీల్లో బలహీన వర్గాలకు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల ప్రకారంగా దాదాపు మూడువేల గ్రామపంచాయతీల్లో బలహీన వర్గాలే ప్రాతినిధ్యం వహిస్తారు. వీటికి అదనంగా అన్ రిజర్వడ్ కేటగిరి నుంచి మరొక నాలుగు వేల గ్రామ పంచాయతీలను గెలవగలిగితే 7వేల గ్రామ పంచాయతీలు అంటే దాదాపు 56 శాతం గ్రామ పంచాయతీలు బలహీన వర్గాల ఖాతాల్లోకి చేరిపోతాయి.
గ్రామపంచాయతీ ఎన్నికలు బలమైన బీసీ ఉద్య మాన్ని సం స్థాగతంగా నిర్మించడానికి ఉపయోగపడుతుంది. బలహీనవర్గాలు తమ బలాన్ని రాజకీయ పార్టీలకు చూపించటానికి ఇది ఒక పరీక్షా కాలం కాబట్టి పం చాయతీ ఎన్నికలను భవిష్యత్తు బలమైన ఉద్యమ నిర్మాణానికి ఉపయోగించుకునే ఎత్తుగడలతో ముందుకు వెళ్లినప్పుడే బలహీనవర్గాలు తమ లక్ష్యాలను సాధించగ లుగుతాయి అన్నది గ్రహించాలి.
వ్యాసకర్త సెల్: 9885465877