29-06-2025 12:00:00 AM
చట్టపరంగా వారిపై ఉక్కు పాదం మోపాలి. ఇందుకుగాను కింది కులాలవాళ్లు అధికారంలోకి రావాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే సరైన నేరస్తులకు తగిన శాస్తి జరుగుతుంది.
చరిత్రలో నమోదైన కాలంలో భారతదేశంలో మహిళల స్థితి అనేక మార్పులకు లోనైంది. ప్రాచీన కాలంలో ముఖ్యంగా ఇండో-ఆర్యన్ మాట్లాడే ప్రాం తాలలో సమాజంలో వారి స్థానం గణనీయమైన మార్పులకు గురైంది. వారి అధీ నత ప్రారంభ ఆధునిక కాలంలో బాగా మెరుగుపడింది.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన (1757 బ్రిటిష్ రాజ్ (1858 కాలంలో, భారత సంస్కర్తలు, వలస అధికారులు ప్రారంభించిన సంస్కరణలతోసహా మహిళల హో దాను ప్రభావితం చేసే చర్యలు అమలయ్యాయి. వాటిలో బెంగాల్ సతి నియం త్రణ 1829, హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం 1856 , స్త్రీ శిశుహత్య ని వారణ చట్టం 1870, సమ్మతి వయస్సు చట్టం 1891 ఉన్నాయి. భారత రాజ్యాంగం లింగం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
భారత రాజ్యాంగం ప్రకారం మహిళల హక్కులలో ప్రధానంగా సమానత్వం, గౌరవం, వివక్ష నుంచి స్వేచ్ఛ ఉన్నాయి. అదనంగా భారతదేశంలో మహిళల హ క్కులను నియంత్రించే వివిధ చట్టాలు ఉ న్నాయి. భారత ప్రభుత్వంలో అనేకమంది మహిళలు భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి వివిధ సీనియర్ అధికారిక పదవుల్లో పనిచేశారు.
అయినా, దేశంలో చాలామంది మహిళలు అనేక రకాల ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. కౌమారదశలో బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలలో పోషకాహార లోపం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీని పరిణామాలు పిల్లల ఆరోగ్యంపై కూడా పడుతున్నాయి.
ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్పాలి!
మహిళలపై హింస ముఖ్యంగా లైంగిక హింస దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తుం ది. -మహిళల రక్షణ, గౌరవం అందరి బా ధ్యత. దుండగుల దౌర్జన్యాలపై ప్రభుత్వా లు ఉక్కుపాదం మోపాలి-. సమాజం తన వంతుగా సహకరించాలి. పిల్లలు, కుటుం బ సభ్యులపై పెట్టుకున్న ఆకాంక్షల నేపథ్యంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా రూపొందించడానికి మహిళలదీ ప్రధాన పాత్ర.
బాల్యం నుంచి అమ్మాయిల పట్ల కొంత వివక్ష చూపుతున్న మాట వాస్తవం. తల్లితండ్రి కూడా బాలికలను అభద్రతకు గురి చేయడంతోపాటు మగవారిని మా త్రమే కొన్ని పనులు చేయడంలో ప్రోత్సహించడం వంటి లక్షణాలవల్ల కూడా వారి పట్ల సమాజంలో చిన్నచూపు నెలకొంటున్నది. వివక్ష దారి తీస్తున్న విషయాన్ని కూడా కుటుంబాలు చిన్ననాటి నుంచి చా లా జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆత్మరక్షణకో సం అన్ని రకాల విద్యలను నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఆత్మస్థైర్యాన్ని పెంచే పరిస్థితులను కల్పించవలసిన అవసరం ఉంది. అప్పుడే వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు మహిళ గురికాకుండా ఉంటుంది. అన్ని రంగాలలోనూ మగవారితో సమానంగా స్త్రీలు కూడా రాణిస్తున్న విషయం కాదనలేం.
అయినా. మహిళలు అనేక రకాల దా డులకు గురవుతున్నారు. పెండ్లి చేసుకోలేదని అక్కసుతో పైశాచికంగా వ్యవహరించే సైకోలు యాసిడ్ దాడులకు పాల్పడడం, కత్తులతో పొడిచి హత్య చేయడం, అకృత్యాలు, అత్యాచారాలకు దిగడం, కాకుండా ప్రేమోన్మాదుల వికృత చేష్టలను తాలలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా దేశంలో వేలల్లో ఉంటున్న ది.
స్త్రీల అక్రమ రవాణాతో జాడ తెలియకుండా పోతున్న వారు కొందరైతే, అను మానాస్పద మృతి కారణంగా తల్లిదండ్రులకు దూరమవుతున్న ఆడబిడ్డల సంఖ్య అంతా ఇంతా కాదు. కన్నతండ్రి నుంచి మొదలుకొని ఇంటి పక్క వాళ్ళు, అవకాశవాదులు, పని చేసే ప్రతిచోట గుంటనక్క ల్లా తొంగి చూస్తూ ఉంటారు. మహిళలపై దురాగతాలకు పాల్పడే వారు ఎక్కువగా తెలిసిన కుటుంబాల వారే ఉంటున్నట్టు ఇటీవలి పరిశోధనలు వెల్లడించాయి.
పెళ్లికి ఒప్పుకోవడం లేదన్నది ఒక కారణమైతే, అనుమానాస్పదంగా కాపురంలో కలతలు మరో కారణం. తాగుడుకు బానిసలై దురాగతాలకు పాల్పడుతున్నవారు ఇం కొందరు. చట్టసభల్లోని మహిళా ప్రజాప్రతినిధుల పైనా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండడం గమనార్హం.
దిగజారుతున్న స్థితిగతులు
ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023- సర్వే ప్రకారంగా 177 దేశాలకుగాను భారతదేశం 128వ స్థానంలో మహిళల భద్రత విషయంలో నిలిచింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014లో భారతదేశంలో మహిళలపైన నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదు కాగా, ఎనిమిదేళ్ల అనంతరం అంటే 2022లో అవి 31 శాతం పెరిగినట్లు తెలుస్తున్నది. మహిళలను ఈ రకంగా వివక్షకు గురిచేయడానికి గల ప్రధానమైన కారణా లు మనందరికీ తెలుసు.
ఈ దుర్మార్గపు పోకడలకు చరమగీతం పాడాల్సి ఉంది. మహిళలు బలి పశువులు కాకుండా ఆత్మగౌరవంతో బతికేలా చూడాల్సి ఉంది. ఈ మానవ మృగాలకు చట్టపరంగా తగిన శిక్ష, ఇతరేతర అవకాశాలను నిషేధించ డం, విద్యాసంస్థల్లో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షను చిన్ననాటి నుండే రద్దు చేయడం, సోదర భావాన్ని కొనసాగించడానికి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవే శపెట్టడం కూడా కీలకమైన అంశాలుగా విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.
చాలా ప్రాంతా లలో ప్రతి సంఘటనలోనూ ము ఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల స్త్రీలు ఎక్కువగా దాడులకు గురవుతున్నట్టు సమాచారం. ఇది ఒక పథకం ప్రకారం కొనసాగుతున్నదని అనుమానం రాక మానదు. చట్టాలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల అధికారాలు అన్నీ కూడా మెజారిటీగా ఆధిపత్య కులాల చేతుల్లో ఉండడం కూడా ఇందుకు కారణమేమో! అందుకే నేరాలు చేసిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి.
చట్టపరంగా వారిపై ఉక్కు పాదం మో పాలి. ఇందుకుగాను కింది కులాలవాళ్లు అధికారంలోకి రావాల్సిన అవసరం కూ డా ఉంది. అప్పుడు మాత్రమే సరైన నేరస్తులకు తగిన శాస్తి జరుగుతుంది. మద్యం, ధూమపానం, మత్తు పానీయాలు, ఇతరత్రా టీవీలు, సినిమాల్లో స్త్రీలను వ్యాపా ర, ఆటసరుకుగా, మార్కెట్ వస్తువుగా ప్రవేశ పెడుతున్న పరిస్థితులు ఇప్ప టికైనా మారాలి. పెట్టుబడిదారీ వర్గాల మాయాజాలాన్ని రూపుమాపాలి.
సామాజిక మాధ్యమాలలో మహిళలకు సంబం ధించిన అగౌరవ చిత్రాలు, సన్నివేశాలు ప్రదర్శనలు, వ్యాఖ్యానాలు రాకుండా చూ డాలి. ఇది సమాజంలోని భిన్నవర్గాల అం దరి బాధ్యత అని అందరూ తెలుసుకుంటే మంచిది. విలువలతో కూడిన విద్య, వికృత రూపాలకు తగిన శాస్తి జరిగినట్లు చూపే కళారూపాలు, సమాజంలో స్త్రీల బాధ్యత కుటుంబాలలో వాళ్ళ పా త్రపైన స్పష్టమైన ప్రదర్శనలు ఇవ్వడం ద్వా రా కరకుగుండెల్లో మార్పు తేగలం. ఇక, పాలకులు మాత్రం ఎంతమాత్రం మౌనం గా ఉండరాదు. రాజ్యాంగం ప్రకారం మ హిళలకు దక్కిన హక్కులు పూర్తిగా అమల య్యేలా చూసే బాధ్యత వారిదే.