calender_icon.png 31 July, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్ 2 ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..

30-07-2025 12:32:11 AM

ఐకానిక్ స్టార్ కథనాయకులు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ల్లో వస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిలమ్స్ బ్యానర్ మీద అయాన్ ముఖర్జీ భారీ ఎత్తున తెరకెక్కించిన చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటి స్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్‌ను దర్శకుడు అయాన్ ముఖర్జీ  మంగళవారం తన సోషల్ మీడియాలో ‘వార్ 2’ లోని మొదటి పాట ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ వేశారు.

ఈ ‘ఆవన్ జావన్’ పాట కోసం ప్రీతమ్, అమితాబ్ భట్టాచార్య, అరిజిత్ సింగ్ అందరూ కలిసి ఈ ప్రత్యేకమైన పాట కోసం పని చేశారు. హృతి క్, కియారా కెమిస్ట్రీ ఈ పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణ కానుందని సమాచారం. కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘వార్ 2’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషల లో విడుదలకానుంది. తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది.