30-07-2025 12:34:14 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందు తోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిసున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్‌ను నిర్మాణసంస్థ తాజా గా షేర్ చేసింది. పవన్ కల్యాణ్ ఎంతో అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొన్నారంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. “ఎన్నో భావోద్వేగాలతో కూడిన‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లైమాక్స్ పూర్తయింది.
నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరి గింది. ఆంధ్రప్రదేశ ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్ సమావేశాలు, బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరోవైపు ‘హరి హర వీరమల్లు’ ప్రచారంలో పవన్ కల్యాణ్ భాగమయ్యారు. మెరుపు వేగంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇది ఆయన అంకితభావానికి, కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం”అని తెలుపుతూ సెట్లో పవన్, హరీశ్ శంకర్‌ల ఫొటోను నిర్మాణ సంస్థ పంచుకుంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా అయనంక బోస్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీతా లుల్లా, కళా దర్శకుడిగా ఆనంద్‌సాయి వ్యవహరిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కల్యాణ్-, హరీష్‌శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.