25-03-2025 12:07:24 AM
నిజామాబాద్ మార్చి 24 (విజయ క్రాంతి) : నిజామాబాద్ లో సంచలనం కలిగించిన నకిలీ పట్టాల తయారీదారులను పట్టుకున్న టాక్స్ ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితులను పట్టుకోవడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ప్రజల నుండి వస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో నకిలీ పట్టాల వ్యవహారం లో అసలు సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రధాన నిందితులను పట్టుకోవ డానికి ఎందుకు త్రాస్తారం చేస్తున్నారని అంత చిక్కని విషయం. నకిలీ పట్టాల సూత్రధారులలో ముందుగా ఇద్దరినీ అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సూత్రధారులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించడానికి కారణం రాజకీయ ఒత్తి డి కారణంగానే మిగతా సూత్రధారులను పట్టుకోవడం లేద అనే విమర్శలు వస్తున్నాయి ఈ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయం తో పాటు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అప్పుడు అధికారంలో ఉన్న వారితో పాటు ప్రస్తుతం అధికార పార్టీ చోటా మోటార్ లీడర్లు గత ప్రభుత్వ లీడర్లతో అంట కాగి ఉండడమే ప్రధాన కారణ మని తెలుస్తోంది. గతంలో అప్పటి ప్రజాప్రతినిధి సోదరుడు నకిలీ పట్టాల తయారీ దారులతో పాటు మిగతా నిందితులను పోలీసులు పట్టుకోవడంలో అడ్డుపడి కాపాడినట్టుగా తెలుస్తోంది.
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు పొలిటికల్ లీడర్ల ప్రమేయంతో వారితో అంట కాకి వారి ఇచ్చింది పుచ్చుకొని అడ్డు అదుపు లేకుండా నకిలీ పట్టాల తయారీలో వారికి సహకరించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టడానికి సహకరించారు. ఫలితంగా నిజామాబాద్ నగరంలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.
నకిలీ పట్టాలకు సంబంధించిన వ్యవహారంలో రిజిస్ట్రేషన్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించినప్పటికీ అరెస్ట్ చేయడంలో దాస్తారం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వృద్ధులైన హక్కుదారులు వారసులు లేని భూములు వివాదాలకు సంబంధించిన భూములను. ముఠాగా ఏర్పడిన ఒక గ్యాంగ్ చేరబట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు అవినీతి అధికారుల సహకారంతో ఈ తతం గం అంతా కొనసాగింది.
ఈ అవినీతి భాగవతంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగి సస్పెండ్ కూడా గురయ్యారు. నగరంలోని దుబ్బ ప్రాంతంలో బీడీ కార్మికులు నిరుపేదల ను సొంత ఇల్లు లేని వాళ్లను టార్గెట్ గా చేసుకొని నకిలీ పట్టాల బాగోతం నడిపారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న బీడీ కార్మికులను నిరుపేదలను మాయమాటలు చెప్పి నకిలీ పట్టాలను వారికి అంటగట్టి అందిన కాడికి దండుకున్నారు.
ఈ తత్తంగంలో బీఆర్‌ఎస్ నాయకులతో పాటు పలానా విలేఖరి కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ఒక్కోక్క పట్టాకు లక్ష యాభై వేల నుండి రెండున్నర లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ లో ఖర్చు అని చెప్పి బలహిణ వర్గాలకు అబద్ధాలు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. పథకం ప్రకారం నాగారం కు చెందిన నకిలీ పట్టాదారులతో పదివేలు మొదలుకొని 25 వేల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు.
గతంలో 35 మందికి పైగా ఇళ్ల పట్టాలను తయారు చేయించి ఇళ్ల పట్టాలను కార్మికుల తో పాటు బీద బిక్కి జనాలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. డబ్బులు వసూలు చేసి నా వారికి పట్టాలు ఇచ్చి పతా లేకుండా పోయారు. ఇచ్చిన పట్టాలకు స్థలం ఎక్కడ ఉందో తెలియక బాధితులు మోసపోయామని గమనించి.
సదరు ముఠాని నిలదీ శారు పలుమార్లు అడిగినప్పటికీ సదరు నాయకులు దాటవేస్తూ ఉండడంతో అప్ప టి టిఆర్‌ఎస్ నాయకుడి పై ఓ బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులకు ఆదేశాలు ఇప్పించారు.
కోర్టు ఆదేశాల ప్రకారం మూ డో టౌన్ పోలీస్ స్టేషన్లో సదర్ బి ఆర్ ఎస్ నేతపై కేసు నమోదు చేసినప్పటికీని. ఇంకా మిగతా నాయకులను అరెస్ట్ చేయడంలో పోలీసులు దాస్తారం చేస్తున్నారు. ఈ నకిలీ పట్టాల కేసు తేలేదు ఎప్పుడు పోలీసులు అరెస్టు చేసేదెప్పుడో వేచి చూడాల్సిందే.