25-03-2025 12:09:04 AM
విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రవినూతల శశిధర్
ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి): హిందూ ధర్మ పరిరక్షణ కోసం యువత అంకిత భవంతో పనిచేయాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రవినూతల శశిధర్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్ పూర్ డివిజన్లోని భోలక్‌పూర్ హౌస్ వద్ద హిందూ వాహిని భోలక్‌పూర్ శాఖ ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్‌ను పురస్కరించుకొని నిర్వ హించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రవి నూతల శశిధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం హిందువులంతా సంఘటితం కావాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్, సుక్ దేవ్, రాజ్ గురు ల ప్రాణ త్యాగాల వల్లనే స్వేచ్ఛగా బతుకుతున్నామని అన్నారు.
వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పాఠశాల సంస్కృ తిని విడనాడి హిందూ ధర్మం గొప్పతనాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆలయాల అభివృద్ధి, పరిరక్షణ కోసం పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో హిందూ వాహిని ప్రధాన కార్యదర్శి బబ్లు విశ్వేశ్వర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు అయిల భాస్కర్, నాయకులు కేఎం శంకర్, ఆర్. విశ్వం, మురళి, సూర్య తదితరులు పాల్గొన్నారు.