calender_icon.png 17 October, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివక్ష ఎక్కడుంటుందో టీజేయూ అక్కడుంటుంది

17-10-2025 12:07:46 AM

రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్రావు 

కామారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : వివక్షత ఎక్కడ ఉంటుందో అక్కడ టీజేయు ఉంటుంది అని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్రావు స్పష్టం చేశారు. టీజేయు ఆధ్వర్యంలో జరిగిన 14వ రాష్ట్ర వార్షికోత్సవ మహాసభలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు కేవలం వార్తలు రాయడం కాదు, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా ఉండాలని చెప్పారు. ప్రజల కోసమే పనిచేసే నిజమైన జర్నలిస్టులు టీజేయులోనే ఉన్నారు  అన్నారు.

టీజేయు తెలంగాణ కోసం మాత్రమే కాదు, ప్రజల కోసం పనిచేసే ఏకైక యూనియన్.  జర్నలిస్టుల సంక్షేమం కోసం టీజేయు కృషి చేస్తున్నదని ఆయన వివరించారు.  సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ మాట్లాడుతూ, నిజం రాసే జర్నలిస్టులు ఎల్లప్పుడూ కష్టాలను ఎదుర్కొంటారు. షోయబ్ ఉల్లా ఖాన్ వంటి నిజాయితీ గల జర్నలిస్టులు సత్యం చెప్పినందుకు ప్రాణాలు అర్పించారు అన్నారు.

ఐఎఫ్డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు డాక్టర్ పెద్దాపురం నరసింహ మాట్లాడుతూ  టీజేయు చేసే ప్రతి న్యాయమైన పోరాటానికి ఐఎఫ్డబ్ల్యూజే పూర్తి మద్దతు ఇస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ, టీజేయు అంటేనే నిబద్ధతగల యూనియన్. ఇందులో పని చేయడం గర్వకారణం. ఎవరైనా జర్నలిస్టుకు కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే స్పందించడం ఆయన నైజం.

ఇతర యూనియన్లలో లేని స్వేచ్ఛ టీజేయులో ఉంది, అన్నారు. ఈ సందర్భంగా డా. భరత్కుమార్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి దశరథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు జర్నలిస్టులకు సన్మానాలు చేశారు. 

ఐఎఫ్డబ్ల్యూజే కార్యదర్శి డా. భరత్కుమార్ శర్మ, రాష్ట్ర కార్యద ర్శులు సిహెచ్ శ్రీనివాస్, సంగారెడ్డి ఇంచార్జ్ బాపురావు, దశరథ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, జిల్లాధ్యక్షులు వల్లపు శ్రీనివాస్, కృష్ణమూర్తి, రామయ్య, షానూర్ బాబా, సంతోష్ కుమార్ ,ప్రసాద్, సుదర్శన్, సిద్ధల రవి, రమేష్ గౌడ్, గండ్ర నరేందర్, ఫసియోద్దీన్, గుడాల శేఖర్, శ్రీకాంత్, సాగర్, శ్రీనివాస్, బైరి ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, పశుపతి  పాల్గొన్నారు.