25-09-2025 12:00:00 AM
ఆదిలాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల పోరు త్వరలోనే ప్రారంభం కానుంది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంద రూ ఆతృతగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ ల అంశం సైతం కొన్ని గంటల్లోనే తేలనుంది. తాజాగా స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో అధికార యంత్రాంగం వీటి ఖరారుపై కసరతు ప్రారంభించి కొలిక్కి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్‌ల కేటాయిం పునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఖరారు చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇందులో అనుసరించాల్సిన విధివిధానాలపై పంచాయ తీరాజ్, రెవెన్యూ, జిల్లా పంచాయతీ అధికారులకు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలోనే వీటిని ఖరారు చేయడంతో ఈ ప్రక్రియను 2 రోజు ల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టి రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేసింది. కీలకమైన రిజర్వేషన్ల అంశం తేలిపోనుండటంతో వీటి ప్రకారం త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
ఆదిలాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానా లు ఉండగా... 168 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి తో పాటు 473 సర్పం చ్ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎన్నికలు జరగనుండగా.. అందరి చూపు రిజర్వేషన్లపైనే కేంద్రీ కృత మవుతోంది. ప్రభుత్వం ఈ సారి 42 శాతం బీ.సీ రిజర్వేషన్లు కల్పించనుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో కొత్తగా ఎవరికి లాభం చేకూరుస్తుందోనని పల్లె వాసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వీటితో పాటు జిల్లాలో అధికంగా నోటిఫైడ్ (ఏజెన్సీ) ప్రాంతం ఉండటంతో ఇక్కడ కొన్ని మండలాల్లో ఎంపీపీ స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేయాల్సి ఉంటుం ది. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్ స్థానాలు కూడా ఎస్టీలకే కేటాయించాల్సి ఉంటుంది. మరోపక్క జిల్లాలో ప్రస్తు తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల స్థానాలు ఖరారు చేయనుం డటంతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏ స్థానం ఎవరికి కేటాయిస్తారోనని సర్వత్రా ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఈ రిజర్వేషన్ల ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించి ప్రక్రియను పూర్తి చేశారు. రిజర్వేషన్లు తేల్చినా ఇప్పుడే వెల్లడించే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఈ జాబితాను అధికారులు రహస్యంగా ఉంచనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ఫలించనున్న ఎదురుచూపులు
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుండటంతో ఆశావహుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ప్రభు త్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా స్థానిక ఎన్నికలు లేకపోవడంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహుల్లోనూ తీవ్ర నిరాశ వ్యక్తమైంది. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా రాణించేందుకు అనేక మంది సిద్ధమవుతుండటంతో వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలిస్తే వారు పోటీ చేయడం.. లేదంటే వారి కుటుంబీకులు, కలిసిరాకుంటే వారి అనుయాయులను పోటీలో నిలిపేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.
ఏ పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని పోటీ లో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో పాలకవర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా నిలిచిపోవడంతో పల్లెలు పైసల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించి ఆ వెంటనే పంచా యతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అందరిలోనూ ఉత్సాహం వెల్లువిరుస్తోంది.