25-09-2025 12:00:00 AM
బతుకమ్మ అంటే తెలంగాణ ఆత్మ
కరీంనగర్, సెప్టెంబర్ 24: కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్‌లో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు బతుకమ్మలను అలంకరించి సంప్రదాయ క్రీడలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి చిన్నమైల్, కోట ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే అసాధారణ పండుగ‘ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పండుగగా బతుకమ్మ గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.