calender_icon.png 23 July, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలపేటకు దిక్కెవరు?

22-07-2025 12:00:00 AM

  1. అంధకారంలో బస్టాండ్ 
  2. వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు 
  3. విష పురుగుల బారిన ప్రజలు 
  4. పట్టించుకోని నేతలు, అధికారులు 

గోపాలపేట జూలై 21: సర్పంచుల పాలన పూర్తయిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సర్పంచుల కాలం ముగిసిందని మళ్లీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే వరకు ప్రత్యేక అధికారులే గ్రామాల పురోగతి చూడాలని ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. ఏర్పాటు అయ్యాక కొన్ని రోజులు మాత్రమే గ్రామాల సమస్యలను అక్కడక్కడ పరిష్కరించారే తప్ప పూర్తిగా పట్టించుకున్న పాపాన పోలేదు.

వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంతోపాటు గ్రామాలలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. గోపాలపేట మండల కేంద్రంలో ఏ వీధి చూసిన అంధకారం నెలకొంది. దీంతో ఏ పని లేని ఆకతాయిలకు దొంగతనం సులువుగా మారింది. రాత్రిళ్ళు రోడ్లపై తిరిగిన ఎవరూ కనిపించరని దొంగల ముఠా ఎక్కువ పెరిగిపోతుందని ప్రజలు కాలనీవాసులు వాపోతున్నారు.

సర్పంచ్ ల కాలంలో కాలనీవాసులు తమ సమస్యల గురించి వెంటనే సర్పంచ్కు సమాచారం అందించి పనులు అయ్యేలా చూసుకునేవారు. కానీ గ్రామాలను ఎవరు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ఎక్కడుందో గానీ సమస్యలు మా త్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తిష్ట వేసి కూర్చున్నాయి. రోడ్లు గుంతలు పడి కనీసం నడవడానికి వీలు లేకుండా మా రాయి. ఇక గోపాలపేట బస్టాండ్ నడిబొడ్డున వీధిలైట్లు లేక అంధకారంలో నెలకొం ది.

నిత్యం వందలాది బస్టాండ్ ప్రధాన రహదారి వెంట రాకపోకలు జరుగుతుంటాయి. దూర ప్రాంతాల్లోకి వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్టాం డ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ బస్టాండ్ ప్రాంతమంతా చీకటితో అంధకారంలోకి మారింది. మహిళా ప్రయాణికు లు ఈ బ స్టాండ్ లో ఉండాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని కూ ర్చుంటున్నారు.

దొంగలు ప్రయాణికుల మెడలో ఉన్న నగలు గొలుసులను కార్ చేయడానికి కాపు కాస్తూ ఉంటారు. బస్టాండ్ ప్రాంతమంతా అంధకారం నిలకడడం పట్ల నిత్యం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవలే బస్టాండులో కొన్ని షాపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయక పోవడం పట్ల దొంగలను ఎలా గుర్తి షాపులో యజమానులు దావేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే ప్రత్యేక అధికారులు గోపాలపేట మండల కేంద్రంలో దృష్టి పెట్టి అంధకారం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రిళ్ళు కాలనీవాసులు బయటకు రావాలంటే విషపురుగుల బారిన పడే ప్రాణాలు పోయే అవకాశాలు దీంతో చీకటిలో బయట కూడా రాలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షా కాలం కావడంతో ట్యాంకులు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేస్తుండాలని ప్రజలు కోరుతున్నారు.

అదేవిధంగా గోపాలపేట మండ లం తాడిపర్తి గ్రామంలో గతంలో ఐమాక్స్ లైట్లు పండు వెన్నెల వెలుగులు నింపుతుండేవి. కానీ గత రెండు మూడు నెలల నుంచి తాడిపర్తి గ్రామం పూర్తిగా అంధకారంలో ఉంది. ఐ మ్యాక్స్ లైట్ లకుకాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ వారి గడువు కాలము ముగిసిందని వాటిని పట్టించుకోవడం మరి చారు. ఇక గ్రామపంచాయతీ అధికారులు తమకు ఏమీ తెలియదని చేతులు దులుపుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో పట్టణాల్లో ప్రతి సమస్య పరిష్కరిస్తారనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా సమస్యలు తలెత్తాయి వెంటనే సంబంధిత అధికారులు గానీ ప్రజా నేతలు గాని పట్టించుకోని ప్రజల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని కాలం అసలు కోరుతున్నారు. 

రోడ్లు నరకంగా మారాయి.

గోపాలపేట మండల కేంద్రం గాంధీ విగ్రహం వెనకాల నుంచి కాలనీలోకి వెళ్లాలంటే రహదారి గుంతల మయంగా ఉంది. అదేవిధంగా చాకలి పల్లి వెళ్లే రహదారి అర కిలోమీటర్ వరకు పూర్తిగా గుంతలు గా మారాయి వచ్చిపోయే బాటసారిలు కిందపడి గాయాలకు గురవుతున్నారు.

 శ్రీనివాసులు గోపాలపేట 

చోరీలు జరగకుండా చూడాలి 

గోపాలపేట మండల కేంద్రంలో గత రెండేళ్లుగా బేకరీ షాపు పెట్టుకుని జీవ నం కొనసాగిస్తు న్నాం కానీ ప్రభుత్వ మారాక బస్టాండ్ ప్రాంతం అంధకారంలో నెలకొంది గతంలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు కాలిపోవడం పట్ల వాటిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ గడు వు పూర్తయినా కూడా ప్రస్తుతం గ్రామపంచాయతీ చర్య తీసుకుని ఉన్న స్తంభాలకు వీధిలైట్లు వేస్తే బస్టాండ్ ప్రాంతం అంధకారం లేకుండా ఉంటుం ది.

ఈ బస్టాండ్ ప్రాంతం అంతా షాపుల లైట్ల తోనే ప్రయాణికులు ప్రజ లు కాలయాపన చేస్తున్నారు కానీ 9 గంటలకు పూర్తయిన వెంటనే షాపులన్నీ మూసివేస్తాం దీంతో ఈ ప్రాంత మంతా చీకటిమయమై దొంగతనాలకు సులువుగా ఉంటుంది. దొంగతనాలు జరగకుండా గ్రామపంచాయతీ స్పందిం చి వెంటనే లైటులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

రాజేష్ గౌడ్ గోపాలపేట