calender_icon.png 22 July, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు 2023ను సవరించాలి

22-07-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, జులై 21, (విజయక్రాంతి):చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ చట్టం 2023 ను సవరించాలినీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న లక్ష్మీ కుమారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో పాల్వంచ మం డల, పట్టణ భారత జాతీయ మహిళా సమాఖ్య5వ మహాసభ జరిగింది.

మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేయడంలో క్షమిం చరాన్ని జాప్యం చేసిన కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా భారత జాతీయ మహిళా సమాఖ్య 2021 వ సంవత్సరం సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగిందినీ, కోర్టుకు సమాధానం చెప్పడానికి పాలకులకు రెండు సంవత్సరాలు పట్టిందినీ విమర్శించారు.

మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టంలో రెండు షరతులు కేంద్ర ప్రభుత్వం విధించింది ఒకటి జనగణ న,రెండు నియోజకవర్గల పునర్వి భజన చేసిన తరవాత టెర్మిషన్ చట్టం అమలు చేస్తామని చె ప్పిందినీ, ఈ అంశాలకు చట్టానికి సంబంధం ఏమిటినీ ప్రశ్నించారు. తక్షణమే షరతులు లేకుం డా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అమలు చేయకపోతే మహి ళా లోకం తిరుగుబాటు తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళా సాధికారత అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మహిళలకి బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో వివక్ష చూపడం జరుగుతుoదని విమర్శించారు. 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి దాన్ని 2026 అమలు చేస్తావని మాయమాటలు చెబుతున్నటువంటి దుర్మార్గ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాలని అన్నా రు.

శ్రామిక మహిళలుకి చాలీచాలని వేతనాలతో గౌరవ వేతనాల పేరుతో శ్రమదోపిడికి గురవుతున్నారని, శ్రామిక మహిళలకి కనీస వేతనాలు రూ 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య. జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ వీసంశెట్టి పద్మజ జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల ధనలక్ష్మి మండల పట్టణ మహిళా సంఘం నాయకురాలు గాలి పద్మ చర్ప లక్ష్మి వాడే లక్ష్మి కోరం స్వర్ణలత ధరమ్ సోత్ అరుణ తదితరులు పాల్గొన్నారు.