calender_icon.png 23 November, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవుల్లో కూల్చివేతలు ఎందుకు?

10-02-2025 01:25:58 AM

హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): సెలవు దినాల్లో కూల్చివేతలు ఎం దుకు చేపడుతున్నారని హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతల్లో ఎందుకింత హడావిడి చేస్తున్నారని మండిపడింది. నోటీసులు ఇచ్చి తగిన వివరణ ఇచ్చేదాకా కూడా ఆగకుండా సెలవుల్లో కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహె డలోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసిన వెంటనే సమాధానం ఇవ్వడానికి తగిన గడు వు ఇవ్వకుండా ఆదివారం కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బాలారెడ్డి అనే వ్యక్తి ఆదివారం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటివద్ద విచారణ చేపట్టాలనే ఆ పిటిషన్‌ను జస్టిస్ కే ల క్ష్మణ్ విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శుక్రవా రం నోటీసులు జారీ చేసి శనివారమే వివర ణ ఇవ్వాలని కోరారని ఆదివారమే కూల్చివేత చర్యలు చేపడుతున్నారని వాపోయారు. దానికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లడానికి తగిన గడువు ఇవ్వకుండానే ఆదివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారని తెలిపా రు.

వాదనల తర్వాత హైకోర్టు.. హైడ్రా తీరు ను తప్పుబట్టింది. నోటీసులు జారీ చేశా క పత్రాలు, ఆధారాలు సమర్పించి వివరణ ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై మండిపడింది. ఎన్ని సా ర్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని ఆ గ్రహం వ్యక్తం చేసింది.

పిటిషనర్ ప్రస్తావించిన ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చే సింది. నోటీసులపై వారంలోగా అన్ని వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.