10-02-2025 01:27:18 AM
* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, ఫిబ్రవరి 09: తనను నమ్ము కున్న ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చి వారి సంక్షేమానికి పని చేస్తానని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి లోని శాస్త్రి నగర్ లోని ప్రజల కోరిక మేరకు 278 సర్వే నంబర్ లో ఉన్న 30 గుంటల భూమిని 229 సర్వేనెంబర్ లోకి బదిలీ చేయడంతో శాస్త్రి నగర్ వాసులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత, అభినందన, ఆత్మీయ సమ్మే ళనలో ఎమ్మెల్యే విజయరామారావు పాల్గొ నగా ఘనంగా సన్మానించారు.
శాస్త్రి నగర్ వాసులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత, అభినందన, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణా రావును ఘనంగా సత్కారించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానికుల ఇండ్ల ముందు కేటాయించ బడి ఉన్న ఇట్టి స్థలాన్ని మరోచోటికి మార్చు తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ప్రజ ల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే తన విధానమని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రి నగర్‌లో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పను లను దశలవారీగా చేపట్టడం జరుగుతుం దని, 278 సర్వే నంబర్ లోని స్థలాన్ని ప్రజా అవసరాల కోసమే వినియోగించడం జరు గుతుందని స్పష్టం చేశారు. మాజీ సర్పం సాయిలు పద్మ, మార్కెట్ కమిటీ మాజీ సాయిరి మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో శాస్త్రి నగర్ వాసులు ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే విజయ రమణారావు పనితీరుకు ఆకర్షితులై శాస్త్రి నగర్ కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బండ రంగస్వామి, బండ నాగరాజు, బండ రాజ్ కుమార్, నక్కల రమేష్, కూకట్ల దేవేం దర్, కూకట్ల తిరుపతి, బండ శ్రీనివాస్, కొమురయ్య, బండ శ్రీనివాస్, రమేష్, రేవెల్లి శివాజీ, పర్వతం శేఖర్, బండ శంకర్ తదితరులు ఉన్నారు.
వీరికి ఎమ్మెల్యే కాంగ్రె స్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కె ట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సాయిరి పద్మ మహేందర్, సిరిగిరి శ్రీనివాస్, వేగోళం అబ్బాయి గౌడ్, చిలుక సతీష్, సమా రాజేశ్వర్ రెడ్డి, బండ గోపాల్, గందే రాజు, బండ తిరుపతి, రఫిక్, రాజయ్య, కుమార్, కిషోర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలు అందించడం అభినందనీయం: ఎమ్మెల్యే
సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో మంచిర్యాల మెడిప్లస్ ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ లు శ్రీకాంత్, దివ్య, కుమార్, ప్రశాంత్‌ల సౌజన్యంతో కరీంనగర్ మేడి కవర్ ఆసుపత్రి, సన్ రైజ్ ఆసుపత్రి ల సంయుక్తాధ్వర్యంలో అవిరినేని లలితమ్మ రాజేశ్వర్‌రావు ల 20వ వర్ధంతి సందర్బంగా ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై శిబిరాన్ని ఎమ్మెల్యే విజయరమణా రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని సేవల ను అందించి పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అవిరి నేని కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ శిభిరంలో 350 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ తాహా, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ కిరణ్ కుమార్ షుగర్, బీపీ, టుడికో పరీక్షలు చేపట్టి రోగ నిర్దారణ చేసి ఉచితంగా మందు లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్న య్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిను పాల ప్రకాశ్‌రావు,చిలుక సతీష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.