10-09-2025 12:45:38 AM
కుండలో దొరికిన బంగారం కథలు..
ఫోన్ కాల్‌తో కొత్త మోసాలు
ఎల్లారెడ్డిపేట,సెప్టెంబర్9 (విజయ క్రాంతి)కుండలో బంగారం దొరికిందని చెబుతూ అమాయకులకు వల పన్నీ కేటుగాళ్లుఫోన్ కాల్ ద్వారా మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధర కు బంగారం ఇస్తామంటూ లక్షల రూపాయ ల ప్రజలను మోసం ప్రయత్నిస్తున్నారు. తె లంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెలుగు చూ సిన ఓ మోసం పద్ధతి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ఒక అనామకుడు ఫోన్ చేసి ఫోన్ కా ల్ చేసి నా పేరు రమేష్ నేను నీకు తెలుసు అంటూ సదరు వ్యక్తికి ఫోన్లో మాయ మాట లు చెబుతూ నాకు.
‘కుండలో బంగారం దొరికింది... మాకు అవసరం లేదు, మీరు తక్కువ రేటుకు తీసుకోండి‘ ఎవరికీ చెప్పకుండా డబ్బులు పట్టుకొని కర్ణాటకలోని బళ్లారికి రండి సగం ధరకే కిలో బంగారం ఇస్తాను అంటూ రెండు రోజుల నుండి తరచు ఫోన్ చేయడం జరుగుతుంది సదరు వ్యక్తికి కొన్ని జిల్లాలో జరిగిన మోసం వేరే వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకొని కంగుతున్నాడు.ఫోన్ కాల్ చేయడం ద్వారా ప్రజలను బలిగా చేసుకుంటున్న మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.
-ఎలా జరుగుతోంది మోసం?
కొంతమంది కేటుగాళ్లు పట్టణాలు, గ్రామాల్లోని వ్యక్తుల వివరాలు సేకరించి, వారి మొబైల్ నంబర్లకు కాల్ చేస్తున్నారు. ‘ఒక పాత ఇంటిని తవ్వుతుండగా కుండలో బంగారం దొరికింది. ఇది అమ్మకానికి ఉంచుతున్నాం. బజార్ ధర కంటే సగం రేటుకే ఇవ్వగలము‘ అంటూ ఆశ చూపుతున్నారు.
ఆ తర్వాత వారి ‘వాట్సాప్ నంబర్‘కు బంగారం నకిలీ ఫోటోలు పంపిస్తూ, బంగారాన్ని ముందుగా చూసి, కొంత డబ్బు అడ్వాన్స్గా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కసారి ఆడ్వాన్స్ చెల్లించగానే, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. ఎంతకీ తిరిగి సంప్రదించలేని పరిస్థితి.
-ఎవరు లక్ష్యంగా మారుతున్నారు?
పెద్దవయస్సు ఉన్నవారు, గృహిణులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ మోసానికి ఎక్కువగా బలవుతున్నారు. ‘సగం ధరకి బంగారం‘ అనే ఆశతో లక్షల రూపాయలు కోల్పోతున్నారు.అలాంటి ఫోన్ కాల్స్ ఎవరైనా చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అసలు గుర్తు తెలియని వ్యక్తుల పట్ల నమ్మకం పెట్టవద్దు. ముందుగా డబ్బు పంపడం మానుకోండి.