calender_icon.png 1 May, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్ట పై ఎందుకీ కన్నెర్ర?

29-04-2025 12:00:00 AM

ఆపరేషన్ కగార్‌లో కొన్ని రాష్టాల బలగాలతోపాటు కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టాయి. వాజేడు, వెంకటాపురం, చర్లవంటి ప్రాంతాల్లో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకే రకరకాల ఆపరేషన్ల పేరుతో అక్కడ భద్రతా బలగాలను ప్రభుత్వాలు మోహరించాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆపరేషన్ కగార్‌తో ఆదివాసీ ప్రజలకు ఉపయోగం ఏంటి? ఎవరి ప్రయోజనం కోసం దీన్నంతటినీ చేస్తున్నారు? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన పౌరహక్కులు కల్పించింది. ఇది గొప్ప అవకాశం. అలాంటప్పుడు హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, ప్రజాస్వామ్యానికి హాని కలగకుండా ప్రభుత్వాలు బాధ్యత వహించలేవా? ఆదివాసీల ప్రాథమిక హక్కులు, విధులను సక్రమంగా అమలయ్యేలా చూడటం ప్రభుత్వాలు, పాలకుల బాధ్యత. ప్రస్తుతం మధ్య భారతదేశంలో ముఖ్యంగా 5వ షెడ్యుల్ పరిధిలో కి వచ్చే భూభాగం చట్టాల ఉల్లంఘన, అశాంతి, పోరాటాలకు కేంద్రంగా మారింది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగా లు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయా లి. పార్లమెంటరీ స్థాయిలో రాజకీయాలు చేసే అవకాశాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి.

మావోయిస్టు, లెనినిస్ట్, మార్క్సిస్టు వంటి సిద్ధాంతాలు ఆదివాసీ ప్రజలకు ఉపయోగపడాలంటే విద్య, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాలలో అభివృద్ధి దిశగా వారిని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేయాల్సి ఉంది. ఆపరేషన్ గ్రీన్‌హంట్, కగార్‌లతో ప్రజలకు మేలు జరగదని, శాంతిభద్రతల పేరుతో ఆదివాసీలపై యుద్ధం చేయడం ప్రజాస్వామా ్యనికి మంచిది కాదని పలువురు సామాజిక విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

అభివృద్ధివైపు దృష్టి సారించాలి

మావోయిస్టులను ఏరి వేసేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును రకరకాల ఆపరేషన్‌ల పేరుతో ఖర్చు పెడుతున్నాయి. దీనికంటే గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించటానికి డబ్బును కేటాయించాలని ఆదివాసీ ప్రజలు కోరుతున్నారు. యుద్ధాలతో అభివృద్ధి సాధ్యం కాదనే సత్యాన్ని పాలకులు తెలుసుకోవాలి. నాణ్యమైన వి ద్యను అందించడానికి అవకాశాలు కల్పించాలి.

గిరిజన ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం ద్వారా తమను అభివృద్ధిలోకి తీసుకువస్తే బాగుంటుందని ఆదివాసీలు భావిస్తున్నారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో పరదేశీ భావజాలాలు, సిద్ధాం తాల అధిపత్యం కోసం ఆదివాసీలను బలి పశువులుగా మార్చడం ఎంతవరకు న్యా యమని సగటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మధ్య భారతదేశ ఆదివాసీ ప్రాంతంలో ఎప్పటి నుంచో పాతుకు పోయిన క్యాపిటలిస్టు విధానాన్ని రద్దు చేయాలి.

బూటకపు ప్రజాస్వామ్య నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని గిరిజన ప్రజలు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వాల విధానాలతో విసుగు చెందిన ఆదివాసీలు ఇప్పటికే పథల్‌గడి, భుంకల్ వంటి పోరాటాలతో ఉవ్వె త్తున ఎగిసిపడ్డ సందర్భాలు ఉన్నాయి.

5వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చిన భూభాగంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్ర జాస్వామికవాదులు ఇలా అందరూ రా జ్యాంగం పక్షాన నిలబడాల్సిన సమయమిదని గిరిజనులు గుర్తు చేస్తున్నారు. ఆపరేష న్ కగాతో ఆదివాసీల బతుకులు మారవు. కనుక, కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు 5వ షె డ్యూల్ భూభాగంలో శాంతి నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలనే వారంటున్నారు. 

యుద్ధ వాతావరణం అవసరమా?

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం, చీకుపల్లి ఆదివాసీగూడెం పరిసర ప్రాంతంలో కర్రెగుట్ట ఉంది. ఆపరేషన్ కగార్‌లో ఇక్కడే కొన్ని రాష్టాల బలగాలతోపాటు కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల వం టి ప్రాంతాల్లో ఖనిజ వనరులు పుష్కలం గా ఉన్నాయి. ఈ వనరులను కొల్లగొట్టేందుకే రకరకాల ఆపరేషన్ల పేరుతో అక్కడ భద్రతా బలగాలను ప్రభుత్వాలు మోహరించాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, గత వారం రోజులుగా కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాల హడావిడితో సుమారు 60 గూడెంలలోని దాదాపు 6 వేలమంది ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వేచ్ఛగా తమ పనులు తాము చేసుకోలేక పోతున్నారు. తుపాకుల మోత, బాంబుల శబ్దాలతో యుద్ధ వాతావరణం నెలకొంది.

దీంతో మహిళలు, పిల్లలు భ యాందోళనలకు గురవుతున్నారు. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్‌ను అమలు చేయ డం వల్ల తమకు ఎటువంటి మేలు జరుగుతుందో చెప్పాలని అక్కడి ఆదివాసీ ప్రజలు అడుగుతున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ప్రభు త్వాలను నిలదీస్తున్నారు. 

హక్కుల పరిరక్షణ ప్రథమ కర్తవ్యం

తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రభావిత ఆదివాసీ గూడెంలలోని గ్రామపెద్దల తో పెసా చట్టం ప్రకారం సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ఇక్క డి ప్రజలు కోరుతున్నారు. మధ్య భారతదేశం సహా 5వ షెడ్యూల్ పరిధిలోకి వచ్చే తమ అభిప్రాయాలను ప్రభుత్వాలు గౌరవించాలని పేర్కొంటున్నారు.

లేదంటే గతంలో జరిగిన పోరాటాల స్ఫూర్తితో ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుబాటు తిరిగి పు రుడు పోసుకుంటుందన్న విషయాన్ని గమనించాలని హెచ్చరిస్తున్నారు. మావోయిస్టులు ఇప్పటికే శాంతి చర్చలకు సిద్ధ మని పలుమార్లు ప్రకటించారు. ఈ సమస్యను శాంతిభద్రతల దృష్టి కోణంలో కా కుండా సామాజిక కోణం నుంచి చూడా ల్సి ఉంది. మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీ ప్రజలను బలి తీసు కున్న సందర్భాలు ఉన్నాయి. 

ఈ విధానం కూడా మంచిది కాదు. అందువల్ల అటు మావోయిస్టులు, ఇటు ప్రభుత్వాలు శాంతి చర్చల వైపు ఆలోచన చేయాలి. ఇరు వర్గాల్లోని ఆదివాసీ ప్రజలు ఇప్పటికే వేల సం ఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అటవీ, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నది. అందువల్ల ప్రభుత్వాలు, విప్లవ పార్టీ లు సమన్వయం పాటించి శాంతి, అభివృద్ధి నెలకొల్పే దిశ గా ముందుకు సాగాల ని ప్రజలు కోరుతున్నారు. ఆపరేషన్ కగార్ కోసం ఖర్చు చేస్తున్న నిధులతో ఆదివాసీ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ అసలు ఎందు కు ఉపయోగపడుతుందని గిరిజన గూడాల్లోని ఆదివాసీ ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో పాగా వేసిన కార్పొరేట్ శక్తుల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాయి. ఈ శక్తులు అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి. ఇటువంటి తరుణంలో దేశంలోని రాజ్యాంగ శక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులుసహా సాధారణ ప్రజల మద్దతు కూడా ఆదివాసీ ప్రజలకు అందాల్సిన అవసరం ఉంది. 

 డా. సంతోష్‌కుమార్ మైపతి