29-04-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్రంలో ఈమధ్య తెలుగు భాషా పండితులు, ఆ చార్యులు మాధ్యమిక విద్యలో సంస్కృతాన్ని అమలు పరిస్తే తెలు గు కనుమరుగు అవుతుందని విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల 85 లక్షల మంది ప్రజలు తెలుగు భాష మాట్లాడుతున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరంలో 4 లక్షలు, రెండవ సంవత్సరం 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కలిపితే, 9 లక్షల మంది విద్యార్థులు. వీరిలో తెలుగు, అరబిక్, హిందీ ద్వితీయ భాషలను అభ్యసించే విద్యార్థులు కాక మిగిలిన వారు సంస్కృతాన్ని ఎన్నుకుంటారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు సంస్కృతాన్ని ఎంపిక చేసుకుంటారు. వీరంతా సంస్కృతాన్ని ఎంపిక చేసుకుంటే తెలుగు భాష కనుమరుగు అవుతుందని చెప్పడం శోచనీయం.
తెలుగు పత్రికలు, దూరదర్శన్, సినిమాలలో తెలుగు భాష ఎంత ఉంది? ఆ రంగాలలో సంస్కృ తం లేదు కదా! మరి, తెలుగు ఎందుకు రావడం లేదు? ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో ఎక్కడ కూడా 10వ తరగతి వరకు సంస్కృతాన్ని బోధించరు. ఆ విద్యార్థులకు తెలుగు ఎందుకు రావడం లే దు? ప్రభుత్వం తెలుగు మీడియం పాఠశాలలను మూసి వేస్తున్నప్పుడు నోరు మెదపని మేధావులు, తెలుగు కనుమరుగు కావడా నికి ఆంగ్ల మీడియం కారణమని తెలుసుకోలేక పోవడం విచిత్రం. డీమ్డ్ యూనివర్సిటీలలో భారతీయ భాషలను అధ్యయనం చేయకుండానే డిగ్రీలను తీసుకుంటున్న విద్యార్థులు ఉన్నారు.
తెలుగు భాష కనుమరుగు కావడానికి కారణాలను అన్వేషించకుండా, తెలుగు భాషకు పరిపుష్టిని కలిగించే సంస్కృతాన్ని ద్వేషించడం ఎంతవరకు సమంజసంమ? మేధావులు, తెలుగు భాషా పండితుల వాదనలు గమనిస్తే వారికి ఉన్నది సంస్కృతంపై ద్వేషం త ప్ప, తెలుగును రక్షించాలనే తపన కనబడడం లేదు. ఇక, మార్కుల విషయానికి వస్తే ఒక ప్రసిద్ధ పండితుడు తెల్ల కాగితం నల్లగా చేస్తే మార్కులు వస్తాయని చెప్పడం, ఉపాధ్యాయ లోకాన్ని అవమాన పరచడమే. 10వ తరగతి వరకు తెలుగు రాని విద్యార్థి సంస్కృతాన్ని వద్దనుకుంటే ఫ్రెంచి, జర్మనీ భాషలను ఎంపిక తీసుకుం టాడు తప్ప, తెలుగును కచ్చితంగా తీసుకుంటాడనే నమ్మకం లే దు. ప్రభుత్వ కళాశాలలలో ఆర్థిక స్థోమత లేనివారే చదువుతున్నా రు.
వారికి సంస్కృతాన్ని అధ్యయనం చేసే అవకాశం లేకపోవడం తో వారు ప్రైవేట్ కళాశాలలో చదివే విద్యార్థులకంటే వెనుక ఉం డడం జరుగుతున్నది. సంస్కృతాన్ని వ్యతిరేకించే మేధావులు ఎ వరి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ప్రస్తు తం విద్యా రంగం అంతా ప్రైవేట్ రంగంలోనే ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కళాశాలలలో అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్యాయం చేయడం తగదు.
సంస్కృతాన్ని బోధించే అధ్యాపకులకు కూడా మాతృభాష తెలుగే అని గ్రహించాలి. తమిళనాడులో తమిళం ప్రథమ భాషగా ఉంది. అదే విధంగా తెలంగాణలో తెలుగును ప్రథమ భాషగా చేయాలనే లక్ష్యంతో, చిత్తశుద్ధితో తెలుగు భాషా మేధావులు, పండితులు, సంఘాలు ప్రయత్నాలు చేస్తే తప్ప మన మాతృభాషకు మనుగడ ఉండదని గ్రహించాలి. మరీ ముఖ్యంగా భాషా పండితులు, విద్యార్థుల మధ్య భాషా ద్వేషాలు పెంచడం సమాజానికి హితం కాదని అలాంటి వారు గ్రహించాలి.
- వేదాంతం హరికుమార్