calender_icon.png 13 September, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు

13-09-2025 09:54:33 PM

మిడ్జిల్: తన భర్త కనిపించడం లేదని ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  మావిళ్ళపల్లి గ్రామం ఉప్పునుంతల మండలం నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన పట్టపర్ల అనుష, శివ గౌడ్, అను వీరిద్దరూ భార్యాభర్తల.  శివగౌడ్ కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. ఈనెల 5వ తేదీన వీరిద్దరూ వాడియాల్ గ్రామంలోని వారి బంధువు అయిన వరలక్ష్మి ఇంటికి కారులో వచ్చారు.

ఈనెల 12వ తేదీన శివ గౌడ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కారు సర్వీసింగ్ చేసుకొని వస్తానని భార్యకు చెప్పి వాడియాల్లోని ఇంటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కల్వకుర్తి వెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటలకు శివ గౌడ్ భార్య అనుష కాల్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భయాందోళనకు గురైంది.  ఈ విషయంపై అతని భార్య అనుష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు.